RGV : శుక్రవారం ఒంగోలు పోలీసుల రామ్ గోపాల్ వర్మ ఎదట హాజరుకానున్నారు. గతంలో ఆయనకు హాజరు కావాలని నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. విచారణకు సహకరించారని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగో తేదీన హాజరు కావాలని ఆయనకు ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు కుదరదని…ఏడో తేదీన అయితే వస్తానని సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం హాజరు కానున్నారు.
Read Also: America : భారత వలసదారుల తరలింపు పై అమెరికా స్పందన..
తాజాగా ఈనెల 7న విచారణకు రావాలని వాట్సప్ ద్వారా నోటీసులిచ్చిన పోలీసులకు రేపు 11 గంటలకు వస్తానని వర్మ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. రాంగోపాల్ వర్మ 2023లో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తశారు. ఆ సినిమా విడుదల సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేశ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.
అయితే వారి పరువుకు భంగం కలిగించారంటూ టీడీపీ మద్దిరాలపాడు మండల కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్ కింద రాంగోపాల్‌వర్మపై అదేరోజు నవంబర్ 10న ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గుంటూరు జిల్లా తుళ్లూరు,. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్‌లోనూ రాంగోపాల్ వర్మపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.