Vennela Kishore : వెన్నెల కిషోర్ కమెడియన్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గతంలో దర్శకుడిగా, మెయిన్ లీడ్ గా ఒకటి రెండు సినిమాలు చేసారు. అయితే వెన్నెల కిషోర్ హీరోగా సినిమాలు చేయను అనే అంటాడు. కానీ ఇటీవల శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనే సినిమా వెన్నెల కిషోర్ హీరోగా వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఉన్నా కమర్షియల్ గా ఫెయిల్ అయింది.
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమా ప్రమోషన్స్ లో వెన్నెల కిషోర్ కనిపించలేదు. ఆ సినిమా వాళ్ళను అడిగితే వెన్నెల కిషోర్ బిజీగా ఉన్నాడు అందుకే రాలేదు అన్నారు. హీరో లేకుండానే సినిమా ప్రమోట్ చేయడం, రిలీజ్ చేయడంతో టాలీవుడ్ లో ఆ సినిమా చర్చగా మారింది. అయితే తాజాగా వెన్నెల కిషోర్ ఆ సినిమా వివాదంపై మాట్లాడాడు. శ్రీవిష్ణు సింగిల్ సినిమాలో వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ తో ఫుల్ గా నవ్వించాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రమోషన్స్ లో భాగంగా కిషోర్ మీడియాతో మాట్లాడాడు.
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ వివాదంపై వెన్నెల కిషోర్ మీడియా ముందు సమాధానం ఇస్తూ.. ఆ సినిమా విషయంలో ఓ తప్పు జరిగింది. నేను ఏ డైరెక్టర్ ని కథ అడగను. ఎందుకంటే కమెడియన్స్ కి కథతో సంబంధం లేదు. నా ట్రాక్ వరకు చెప్పమని అడుగుతాను. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ దర్శకుడ్ని కూడా అలాగే నా పాత్ర వరకు చెప్పమన్నాను. ఆ సినిమాలో నాది ఓ చిన్న ఇన్వెస్టిగేటివ్ పాత్ర అని చెప్పి, కేవలం 7రోజులు కాల్షీట్స్ అడిగారు. అనన్య నాగళ్లతో పాటు ఇంకో అబ్బాయి హీరో అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు డేట్స్ పెంచి, కొన్ని ఎమోషనల్ సీన్స్ పెంచారు. ఓరోజు గెటప్ శ్రీను ఫోన్ చేసి హీరోగా చేయనన్నావు శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమా చేస్తున్నావట కదా అని అడిగితే నేను షాక్ అయ్యాను. నేను కాదు హీరో అంటే అందరూ నువ్వే హీరో అని చెప్తున్నారు అన్నాడు. వెంటనే డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగితే మీరు కాదు, మీది కాస్త పెద్ద క్యారెక్టర్ అన్నాడు. అప్పుడు సినిమా టైటిల్ కూడా వేరే ఉంది. కానీ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నా పాత్ర పేరుతో టైటిల్ రిలీజ్ చేసి నన్ను హైలెట్ చేసారు. డైరెక్టర్, నిర్మాతలు అలా చేయడం తప్పు. నాకు హీరో అని చెప్పకుండా నేను హీరోగా చేయని సినిమాకు నేను హీరో అన్నట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం తప్పు. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే అది నా ఇమేజ్ కి మైనస్ అవుతుంది. అందుకే నేను ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు అని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై ఆ మూవీ యూనిట్ ఏమైనా స్పందిస్తుందా చూడాలి.
Also Read : Suriya : కార్తితో సినిమా తీసిన డైరెక్టర్ కి.. ఫేవరేట్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..