Site icon HashtagU Telugu

Venky Kudumula : చిరంజీవి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Venky Kudumula Gives Clarity on why Megastar Chiranjeevi Movie Cancelled

Venky Kudumula

Venky Kudumula : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల యువ దర్శకులకు ఓకే చెప్తూ వాళ్ళతోనే సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు వెంకీ కుడుములకు కూడా ఓకే చెప్పాడు. వెంకీ కుడుముల – చిరంజీవి సినిమా పూజా కార్యక్రమం కూడా అయింది. కానీ ఆ సినిమా మొదలవ్వకుండానే ఆగిపోయింది. దీనిపై తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు.

వెంకీ కుడుముల ప్రస్తుతం నితిన్, శ్రీలీల జంటగా రాబిన్ హుడ్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మార్చ్ 28 విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ కుడుముల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవి సినిమా గురించి ప్రస్తావన వచ్చింది.

దీంతో వెంకీ కుడుముల స్పందిస్తూ.. భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం కథ రాసుకొని ఆయనకు చెప్పాను. ఆయనకు కథ నచ్చింది చేద్దాం అన్నారు. నేను చిరంజీవి అభిమానినే. ఆయన కథ ఓకే అనడంతో చాలా సమయం తీసుకొని స్క్రిప్ట్ రెడీ చేశాను. కానీ ఆ స్క్రిప్ట్ ఆయనకు అంతగా నచ్చలేదు. దాంతో మళ్ళీ వేరే కథ రాసుకొని వస్తాను అని చెప్పాను చిరంజీవి గారికి. ప్రస్తుతం చిరంజీవి గారు బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో నితిన్ కి ఒక కథ చెప్పాను. ఆయనకు నచ్చడంతో ఇలా రాబిన్ హుడ్ సినిమా పూర్తి చేశాను అని తెలిపారు.

ఛలో, భీష్మ సినిమాలతో హిట్స్ కొట్టిన వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ చిరంజీవి కోసం కథ రాసి తీసుకెళ్తాడా చూడాలి.

 

Also Read : Pawan Kalyan : ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పిన పవన్.. అప్పటివరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా..