Site icon HashtagU Telugu

Viral Video: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీమామ సందడి

Venky Ntrsons

Venky Ntrsons

ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ రామ్ (Abhay Ram and Bhargava Ram) తో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇద్దరినీ దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించి..వారి చదువుల గురించి అడిగితెలుసుకున్నారు. వారు చెప్పే మాటలకు వెంకీ ఫిదా అయ్యాడు.

జూ.ఎన్టీఆర్‌ (Ju NTR) బావమరిది, లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) సోదరుడు నార్నే నితిన్‌ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram), వెంకటేశ్‌ (Venkatesh) తదితరులు ఈ వేడుకలో సందడి చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చిత్రసీమలో వరుసగా యంగ్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ మధ్య చాలామంది పెళ్లి చేసుకోగా..తాజాగా ఇప్పుడు నితిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. ‘మ్యాడ్‌’ (MAD)సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచమై మంచి హిట్ అందుకున్న నార్నే నితిన్‌ (Narne Nithin ) శివాని (Shivani)ని వివాహం చేసుకోబోతున్నాడు.

ఇక వెంకటేష్ విషయానికి వస్తే ..ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ – 2, ఎఫ్ – 3 సినిమాలు విడుదలై కామెడీ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో కొత్తగా వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్.. ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : Appudo Ippudo Eppudo Trailer : నిఖిల్ ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధంగా ఉండండి..