Site icon HashtagU Telugu

Venkatesh Trisha Combo: వెంకీ, త్రిష కాంబో అసలు నిజం ఇదే

Venkatesh Trisha Combo

Venkatesh Trisha Combo

Venkatesh Trisha Combo: విక్టరీ వెంకటేష్.. సైంధవ్ సినిమా రిజెల్ట్ తో రూటు మార్చారు. యాక్షన్ మూవీస్ చేయాలి.. థ్రిలర్స్ చేయాలి అనుకున్న వెంకీ.. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ మూవీ.. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయాలి అనుకుంటున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుచేత సక్సెస్ సాధించాల్సిన ఈ టైమ్ లో అనిల్ అయితేనే కరెక్ట్ గా డీల్ చేస్తాడు.. ఖచ్చితంగా సక్సెస్ అందిస్తాడని మూవీ ప్లాన్ చేస్తున్నారట.

వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో వెంకీకి జంటగా త్రిష నటించనుందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. వెంకీ, త్రిష కలిసి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, నమో వెంకటేశాయ చిత్రాలు చేశారు. ఈ మూడు సినిమాలు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటిస్తే.. మరింత క్రేజ్ వస్తుందని.. అందుకనే ఈ కాంబోని ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అవ్వడం నిజమే అనుకున్నారు. అయితే.. ఇదంతా జస్ట్ రూమర్ అని తెలిసింది.

వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ అనేది నిజమే కానీ.. ఇందులో త్రిష నటించడం అనేది మాత్రం కన్ ఫర్మ్ కాలేదని వాస్తవం. అసలు ఎవర్ని తీసుకోవాలి కథానాయికగా అనేది ఇంకా ఆలోచించలేదట. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్టోరీ లైన్ ఓకే అయ్యింది. ఫుల్ స్టోరీ రెడీ చేయాల్సివుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం త్రిష ఫుల్ ఫామ్ లో ఉంది. పొన్నియన్ సెల్వన్ మూవీతో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు చిరంజీవితో విశ్వంభర మూవీలో నటిస్తోంది. అందుచేత మేకర్స్ త్రిష అయితే మరింత క్రేజ్ వస్తుందని ఆమెనే ఫైనల్ చేస్తారేమో చూడాలి.

Also Read: Game Changer: చరణ్‌ గేమ్ ఛేంజర్ లో పవర్ స్టార్..?

Exit mobile version