Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunam : వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Venkatesh Sankranthiki Vasthunnam Movie Two Days Collections

Sankranthiki Vasthunnam

Sankranthiki Vasthunam : దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న థియేటర్స్ లో రిలీజయి దూసుకుపోతుంది. మొదటి ఆట నుంచే ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా అదరగొడుతుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు 32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లో మొత్తం 77 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వెంకటేష్ సినిమాకు రెండు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే పెద్ద హిట్ అయినట్టే. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే కలెక్షన్స్ పరంగా 100 కోట్ల గ్రాస్ తెచ్చుకోవాలి.

 

.

ఇవాళ కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఫుల్ అయిపోయాయి కాబట్టి ఈజీగా 100 కోట్లు దాటేసి ఫుల్ ప్రాఫిట్స్ లోకి వస్తుంది ఈ సినిమా సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

 

Also Read : Rakesh Roshan : వాళ్ళవి అవే పాత సినిమాలు.. కొత్తగా ట్రై చేయరు.. సౌత్ సినిమాలపై రాకేష్ రోషన్ కామెంట్స్..