Venkatesh : వెంకటేష్ హీరోయిన్ గా మీనాక్షి కాదా.. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్నారా..?

Venkatesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత తనకు రెండు హిట్లు ఇచ్చిన అనిల్ రావిపుడితోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఎమోషనల్

  • Written By:
  • Publish Date - June 22, 2024 / 11:54 AM IST

Venkatesh విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత తనకు రెండు హిట్లు ఇచ్చిన అనిల్ రావిపుడితోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ గా ఉంటూ వెంకీ మార్క్ ఎంటర్టైన మూవీగా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా మీనాక్షి చౌదరి అన్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది.

కోలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది. తన సహజ నటనతో ఆకట్టుకునే ఐశ్వర్య రాజేష్ కి మంచి గుర్తింపు తెచ్చే పాత్ర పడలేదు. ఐతే వెంకటేష్ సినిమా రూపం లో అమ్మడికి ఆ ఛాన్స్ వచ్చింది. వెంకటేష్ అనిల్ రావిపుడి కాంబో సినిమాలో ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ వచ్చిందట.

ఈ సినిమాతో తెలుగులో మరోసారి అమ్మడు లక్ టెస్ట్ చేసుకోబోతుంది. తమిళ, మలయాళ సినిమాల్లో నటించినా సరే మీనాక్షికి స్టార్ క్రేజ్ రాలేదు. ఐతే తెలుగులో ఒక్క హిట్ పడితే మాత్రం అమ్మడి ఫేట్ మారే అవకాశం ఉంటుంది. మరి వెంకటేష్ తో ఐశ్వర్య ఛాన్స్ నిజమేనా అమ్మడికి ఇప్పటికైనా లక్ కలిసి వస్తుందా అన్నది చూడాలి.

Also Read : BiggBoss Telugu : బిగ్ బాస్ కి ఉన్న ఏకైక ఆప్షన్ అతనేనా..!