Site icon HashtagU Telugu

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం వేధింపులకు మాయమైన అందాల తార.. ఎక్కడుంది ?

Dawood Ibrahim

Dawood Ibrahim

Dawood Ibrahim : ఆ హీరోయిన్ ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మెరుపై మెరిసింది.. 

ఒక్క సినిమాతో అందాల రాక్షసిగా పేరు తెచ్చుకుంది.. 

అయితే ఈ ఫేమ్ ఆమెకు కష్టాలను తెచ్చిపెట్టింది. 

అలనాటి అండర్ వరల్డ్  డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను ఆమెపై పడింది.. 

దీంతో ఆమె కెరీర్ అంతటితో క్లోజ్ అయింది.. ఇంతకీ ఆ అందాల తార ఎవరు ?  ఏమైపోయింది ? 

1988లో వచ్చిన హారర్ సినిమా ‘వీరానా’ గుర్తుందా ? 35 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. రామ్‌సే బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. కేవలం రూ.45 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.2.7 కోట్లు రాబట్టింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బాక్సాఫీస్ లో ‘వీరానా’ కంటే ఈ సినిమాలోని హీరోయిన్ ఎక్కువ హిట్టయింది. ఆమె పేరు జాస్మిన్ దున్నా. మూవీలో ఆమె క్యారెక్టర్ కు జాస్మిన్ భాటియా అనే పేరు పెట్టారు. ఈ సినిమా తర్వాత జాస్మిన్ దున్నాను ‘మోస్ట్ బ్యూటిఫుల్ భూత్నీ’ అని అందరూ పిలిచేవారు. అయితే ఆమె అప్పట్లో హఠాత్తుగా అదృశ్యమైంది. ఎక్కడికి వెళ్లిందో  ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యారనే టాక్ ఉంది. అయితే అది కన్ఫార్మ్ కాదు !!

జాస్మిన్ ను వెంటాడి.. వేధించింది ఎవరు ? 

జాస్మిన్ దున్నా అదృశ్యమైన తర్వాత అనేక రకాల కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలనాటి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) ‘వీరానా’ సినిమాలో జాస్మిన్ దున్నాను చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడని కొందరు అంటారు.  అతడు జాస్మిన్ కు ఫోన్ కాల్ చేసి వేధించేవాడని చెబుతారు. దావూద్ ఇబ్రహీం మనుషులు కూడా  జాస్మిన్ ను వెంబడించే వారని చెబుతుంటారు. ఈ వేధింపులకు భయపడి  ఆమె చాలా నెలల పాటు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడం కూడా మానేశారనే కథనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అన్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయి ఉంటారని అంటారు. 1990వ దశకంలో మీడియాలో పబ్లిష్ అయిన కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం జాస్మిన్ దున్నా పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని ఆ రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

Also read : Age of Consent: 16 ఏళ్లకే అమ్మాయిలు శృంగారం చేసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

జాస్మిన్ దున్నా బోల్డ్ సీన్స్..  

దర్శకుడు ఎన్‌డీ కొఠారి 1979లో హీరో  వినోద్ ఖన్నాతో ‘సర్కారీ మెహమాన్’ అనే మూవీ తీశారు. ఈ సినిమాలో జాస్మిన్ దున్నాకు తొలి  ఛాన్స్ దొరికింది.  దీని తరువాత జాస్మిన్ నటించిన రెండో మూవీ ‘తలాక్’. ఇందులో షర్మిలా ఠాగూర్ ఆమెతో పాటు  ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ మూవీ కూడా జాస్మిన్ కెరీర్‌కు పెద్దగా  ప్రయోజనం కలిగించలేదు.  ఎందుకంటే ఈ రెండు చిత్రాలలో ఆమె సాధారణ పాత్ర మాత్రమే పోషించింది. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. ఇక తాను సినిమాల్లో స్పెషల్ గా  ముద్ర వేయాలంటే గ్లామరస్ పాత్రలు చేయాల్సిందేనని జాస్మిన్ దున్నా గ్రహించింది. దీని తర్వాత రామ్‌సే బ్రదర్స్ ‘వీరానా’ మూవీ చేసేందుకు జాస్మిన్ సంతకం చేసింది. ఈ మూవీలో బెడ్‌రూమ్ సీన్, బాత్రూమ్ సీన్ లను కూడా జాస్మిన్‌ చేసింది.  దీని తరువాత, జాస్మిన్ కు భారీగా మూవీ ఆఫర్స్ వచ్చాయి.