విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి (Vijay Devarakonda – Gowtam Tinnanuri) కలయికలో “V12” మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సరైన హిట్ లేని విజయ్..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన గౌతమ్ తిన్ననూరి..ఈసారి విజయ్ తో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్న మేకర్స్.. ఇటీవల శ్రీలంక షెడ్యూల్‌ను పూర్తి చేసారు. ఇప్పటివరకు 60 % వరకు షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఈరోజు విజయ్ తాలూక లుక్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు మేకర్స్. వర్షంలో తడుస్తూ, ముఖంపై రక్తంతో ఉన్న విజయ్.. దెబ్బలు తగలడంతో రక్తం వస్తుండగా చాలా కోపంగా పైకి చూస్తూ అరుస్తున్నాడు. మొత్తంగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్రకటించనున్నట్లు తెలిపింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా వచ్చే సమ్మర్ కోసం ఒక్కో హీరోగా ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి రెండు వారాలు ముందు విజయ్ దేవరకొండ.. బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు.
His Destiny awaits him.
Mistakes.
Bloodshed.
Questions.
Rebirth.28 March, 2025.#VD12 pic.twitter.com/z2k0qKDXTC
— Vijay Deverakonda (@TheDeverakonda) August 2, 2024
Read Also : Water After Meals: భోజనం చేసిన తర్వాత నీరు తాగడం లాభమా..? నష్టామా..?