Varun Tej : ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ క్రికెట్ టీం అంటూ..

నిన్న అక్టోబర్ 22న ఇండియా(India) - న్యూజిలాండ్ తో తలపడి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్(Varun Tej) పాల్గొన్నాడు.

Published By: HashtagU Telugu Desk
Varun Tej participated in IND Vs NZ World Cup Match Telugu Commentary

Varun Tej participated in IND Vs NZ World Cup Match Telugu Commentary

వరల్డ్ కప్ 2023(World Cup) ఇండియాలో గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇండియా వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుస్తూ దూసుకుపోతుంది. నిన్న అక్టోబర్ 22న ఇండియా(India) – న్యూజిలాండ్ తో తలపడి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్(Varun Tej) పాల్గొన్నాడు. వరుణ్ తేజ్ తన ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మ్యాచ్ కామెంట్రీ లో పాల్గొన్నాడు.

అయితే కామెంట్రీ మధ్యలో సరదాగా మాట్లాడుతూ పలు విషయాలు చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ హీరోలని క్రికెట్ టీం అని వ్యాఖ్యానిస్తు విమర్శలు చేస్తారు. దీనిపై వరుణ్ తేజ్ స్పందిస్తూ.. మమ్మల్ని మెగా ఫ్యామిలీని క్రికెట్ టీం అంటారుగా. ఒక మ్యాచ్ సెట్ చేయండి అయితే, వచ్చి ఆడతాం. నేను, చరణ్ అన్న, శిరీష్, బన్నీ, తేజ్.. అందరం వచ్చి క్రికెట్ ఆడతాం అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇక వరుణ్ తేజ్ త్వరలోనే లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. త్వరలోనే ఇటలీలో వీరిద్దరూ ఒక్కటవబోతున్నారు.

Also Read : Prabhas : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ స్టోరీ..

  Last Updated: 23 Oct 2023, 06:46 AM IST