మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఇటీవల ఆ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. త్వరలోనే వారు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని కూడా వార్తలు రాగా ఆ వార్తలను నిజం చేస్తూ నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం జరిగింది. నేడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం(Engagement) హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థం కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి మెగా ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు. నేడు సాయంత్రం నిశ్చితార్థం జరగగా తాజాగా వరుణ్ తేజ్, లావణ్య తమ నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
వరుణ్, లావణ్య ఇద్దరూ ఒకే ఫోటోలు షేర్ చేశారు. తమ లవ్ దొరికింది అని పోస్ట్ చేశారు. ఇక లావణ్య అయితే తమ లవ్ స్టోరీ 2016 నుంచి మొదలైనట్టు తెలిపింది. దీంతో లావణ్య – వరుణ్ నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా అభిమానులు లావణ్యకు మెగా కోడలు అంటూ వెల్కమ్ చెప్తున్నారు.
Also Read : Kevvu Kartheek : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ నటుడు.. పలువురు సినీ, టీవీ సెలబ్రిటీల హాజరు..