Site icon HashtagU Telugu

Varun Tej- Lavanya Tripathi : మెగా ‘పెళ్లి సందడి ‘ మొదలైంది

Varun Tej- Lavanya Tripathi

Varun Tej- Lavanya Tripathi

మెగా ఫ్యామిలీ (Mega Family) ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ – లావణ్య (Varun Tej- Lavanya Tripathi) ల పెళ్లి న‌వంబ‌ర్ లో జరగబోతుండగా.. అదే నెల‌లో ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసారు. ఈ క్రమంలో వరుణ్ – లావణ్య లు ముంబైలోని ఫేమ‌స్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా స్టోర్ లో క‌నిపించారు. పెళ్లి షాపింగ్ లో భాగంగానే వీరిద్దరూ షాపింగ్ కి వ‌చ్చార‌ని తెలుస్తోంది. పెళ్లికి అవ‌స‌ర‌మైన డిజైన‌ర్ దుస్తుల‌న్నింటిని ఇందులో కొనుగోలు చేసే ప‌నిలో భాగంగా ఇరువురు క‌లిసి వెళ్లిన‌ట్లు సమాచారం. పెళ్లి సమయం దగ్గర పడుతుండడం తో ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారని తెలుస్తుంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో వచ్చిన ‘మిస్టర్’ (Mister) సినిమా సెట్స్ లో లావణ్యను కలిశాడు. అప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలోనూ ఈ జంట సన్నిహితంగానే మెలిగేదట. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారిందట. అప్పటి నుంచే డేటింగ్ లో ఉన్నా కూడా ఈ విషయాన్ని రహస్యంగాను ఉంచింది ఈ జంట. తర్వాత ‘అంతరిక్షం’ (Antariksham Movie) సినిమాతో మళ్లీ కలిసి నటించారు వరుణ్-లావణ్య. ఈ సినిమా టైమ్ లోనే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక తర్వాత ఇద్దరూ ప్రయివేట్ పార్టీలలో కూడా కలిసి కనిపించారు. విశేషమేమిటంటే వరుణ్ చెల్లెలు నిహారిక వివాహానికి హాజరైన అతి కొద్ద మంది సన్నిహితుల్లో లావణ్ కూడా ఉంది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు మొదలైయ్యాయి. ఆ తరువాత అవే నిజమయ్యాయి.

Read Also : Vizag : క్షుద్రపూజల పేరు చెప్పి 48 తులాల బంగారం ఎత్తుకెళ్లిన పూజారి

ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే గాండీవధారి అర్జునతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం వరుణ్‌ ఓ కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ ఆపరేషన్ వాలెంటైన్‌ అనే ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌గ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే పులిమేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది.