టాలీవుడ్ (Tollywood) లో రూమర్స్ సర్వసాధారణం. పలానా హీరోయిన్ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుందనీ, ఓ యంగ్ హీరో తన కో స్టార్ తో పీకల్లోతు ప్రేమలో మునిగాడని అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి. అభిమానులు కూడా ఇష్టమైన జంటల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతూనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి వార్త గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఈ ఇద్దరు వచ్చే నెల జూన్ లో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో నిశ్చితార్థం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులు అధికారింగా వెల్లడించాల్సి ఉంది. కాగా ఈ ఇద్దరు తారలు తమ రిలేషన్ షిప్ గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వనప్పటికీ, టాలీవుడ్ వర్గాలు మాత్రం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత, ఎగేంజ్ మెంట్ చేసుకొని, ఆఫై పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఈవెంట్ కు మెగాఫ్యామిలీతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి.
రూమర్స్ నిజమని స్పష్టమైతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ ఏడాది చివర్లో గ్రాండ్ వేడుకలో వివాహం చేసుకోవడం ఖాయమే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం మూవీలో జంటగా నటించారు. గతంలో ఈ ఇద్దరు తారలు పలు ఈవెంట్లలో కలిసి కనిపించారు. అయితే ఇక పెళ్లి విషయమై తండ్రి నాగబాబు రియాక్ట్ అయ్యారు. ‘త్వరలో వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కోబోతున్నాడు’’ అని ప్రకటించాడు. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ అందాల భామ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఆసక్తికర కామెంట్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. వరుణ్ తేజ్.. మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ అని ఈ బ్యూటీ చెప్పడంతో రూమర్స్ నిజమే అయ్యి ఉండవచ్చునని అభిమానులు బలంగా భావిస్తున్నారు.
Also Read: Heroines Summer Looks: సమ్మర్ సీజన్ లో సెగలు రేపుతున్న హీరోయిన్స్, లేటెస్ట్ పిక్స్ వైరల్!