Site icon HashtagU Telugu

Varun – Lavanya Reception :అట్టహాసంగా వరుణ్-లావణ్య ల ‘రిసెప్షన్’..తరలివచ్చిన సినీ తారలు

Varun

Varun

ఈ నెల 01 న ఇటలీ లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల వివాహం (Varun – Lavanya Wedding) అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారం రోజుల పాటు మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఇటలీ లోనే గడిపి..శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న ఈ నూతన జంట కు మెగా అభిమానులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు.

ఇక నిన్న ( నవంబర్ 5 న) హైదరాబాద్ లోని మాదాపూర్ N కన్వెషన్ హాల్ లో రిసెప్షన్ (Varun – Lavanya Reception) వేడుక గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు , పలువురు రాజకీయ ప్రముఖులు రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి , వెంకటేష్ , నాగ చైతన్య , అడివి శేష్ , దిల్ రాజు, సుకుమార్ ఎం నాదెండ్ల మనోహర్ తదితరులు సందడి చేసారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో ఇండస్ట్రీని ఎవరిని పిలవకుండా కేవలం బంధుమిత్రుల మధ్యనే ఈ పెళ్లిని కానిచ్చారు. ఇక రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిపారు. వరుణ్ – లావణ్య వెడ్డింగ్ రెసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also : RTC Bus Mishap : విజయవాడ బస్టాండ్ లో బస్సు బీభత్సం….ముగ్గురు మృతి