Chandrababu : చంద్రబాబు లక్కీ నెంబర్ రోజున వ్యూహం – RGV

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 08:14 PM IST

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)..మరోసారి చంద్రబాబు (Chandrababu) ఫై ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని ..వైసీపీ నుంచి ఆయన లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23.. 2019లో బాబు గెల్చుకున్న స్థానాలు 23… ఆయన అరెస్టయిన తేదీ 9-9-23 కూడితే ౨౩.. ఆయన ఖైదీ నంబర్ 7691.. కూడితే 23 .. NTR నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటోన్న లోకేశ్ పుట్టిన తేదీ 23 .. వ్యూహం సినిమా రిలీజ్ 23 ‘ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయాల వేడి కొనసాగుతుంది..ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇదే క్రమంలో వైసీపీ..సినిమాలతో ఓటర్లను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. గత ఎన్నికల సమయంలో యాత్ర సినిమాతో ప్రజలను తమ వైపు తిప్పుకున్న జగన్..రీసెంట్ గా యాత్ర 2 తో ప్రజల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ సినిమాను చూసేందుకు వైస్సార్ అభిమానులు , వైసీపీ శ్రేణులు పోటీ పడుతుండగా..ఇప్పుడు వర్మ సైతం జగన్ బయోపిక్ తో రాబోతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

వర్మ తెరకెక్కించిన తాజాగా పొలిటికల్ మూవీ ‘వ్యూహం’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత డిసెంబర్ 29వ తేదీకి వాయిదా వేశారు. ఇదే క్రమంలో ‘వ్యూహం’ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, విడుదలను నిలిపేయాలని నారా లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేయడం తో రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తో ఫిబ్రవరి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ విషయాన్నీ వర్మ తనదైన స్టయిల్ లో చెప్పుకొచ్చాడు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని ..వైసీపీ నుంచి ఆయన లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23.. 2019లో బాబు గెల్చుకున్న స్థానాలు 23… ఆయన అరెస్టయిన తేదీ 9-9-23 కూడితే 23.. ఆయన ఖైదీ నంబర్ 7691.. కూడితే 23 .. NTR నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటోన్న లోకేశ్ పుట్టిన తేదీ 23 .. వ్యూహం సినిమా రిలీజ్ 23 ‘ అని ట్వీట్ చేసాడు. అలాగే వ్యూహం కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘శపథం’ చిత్రాన్ని కూడా మార్చి 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. వ్యూహం’, ‘శపథం’ చిత్రాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.

Read Also : Pawan Kalyan : పవన్ జోలికొస్తే పీర్ల పండగే..ఖబడ్దార్..జానీ మాస్టర్ మాస్ వార్నింగ్