Site icon HashtagU Telugu

Varalaxmi Sarathkumar: పెళ్లి పీటలెక్కబోతున్న జాతిరత్నాలు బ్యూటీ.. వరుడు ఎవరో తెలుసా?

Mixcollage 14 Mar 2024 05 06 Pm 1972

Mixcollage 14 Mar 2024 05 06 Pm 1972

తెలుగు సినీ ప్రేక్షకులకు జాతి రత్నాలు బ్యూటీ పరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని చాలామంది భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఫరియా అబ్దుల్లాకి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అదేంటంటే ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందట. కాగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని ఆమెకు ఆ సినిమాల ద్వారా గుర్తింపు రాలేదు. జాతి రత్నాలతో మంచి పేరు వచ్చినప్పటికీ సరైనా అవకాశం మాత్రం రాలేదు. కెరీర్ ను కరెక్ట్ గా సెట్ చేసుకోలేకపోయింది బ్యూటీ. దీంతో అడపాదడపా పలు ఈవెంట్స్ లో మెరుస్తూ వచ్చింది ఫరియా మరీ ముఖ్యంగా ఆరడుగులుండే ఫరియా డాన్స్ కు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె బెల్లీ డాన్స్ వేస్తే కుర్రాళ్లు పూనకాలతో ఊగిపోతుంటారు. రీసెంట్గా ఫరీయా అబ్దుల్లా కి సంబంధించిన ఒక సెన్సేషనల్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట. అవును సినిమాలు పెద్దగా లేవు. కాని ఆమె ప్రయత్నం చేస్తే మాత్రం మంచి కెరీర్ ఉంది ప్రస్తుతం ఫరియాకు. కాని అదేమి వద్దని ఆమె పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.తన స్నేహితడినే అనేది టాలీవుడ్ లో టాక్. చిన్ననాటి నుంచి తనకు తెలిసిన తన సొంత ఫ్రెండ్ నే ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోబోతోందట. ఈ ఏడాది ఆఖరి లోపు వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.