చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ (Drugs ) పేరు కలకలం రేపింది. ప్రముఖ నటి వరలక్ష్మి (Varalakshmi ) శరత్ కుమార్ కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ (NIA) నోటీసులు ఇచ్చిందంటూ ఉదయం నుండి మీడియా లో ప్రచారం అవుతుండడం తో అంత షాక్ లో పడ్డారు. చిత్రసీమలో అడుగుపెట్టి చాలాకాలమే అవుతున్నప్పటికీ వరలక్ష్మి కి మొన్నటి వరకు పెద్దగా గుర్తింపు రాలేదు.
Read Also : Rajinikanth : కండక్టర్ గా పనిచేసిన బస్ డిపో ను సందర్శించిన రజనీకాంత్..
ఈ మధ్యనే తెలుగు లో వరుస సినిమా ఛాన్సులు కొట్టేస్తూ..ప్రేక్షకులను అలరిస్తూ బిజీ గా మారింది. ఈ తరుణంలో ఆమెకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు వార్తలు బయటకు రావడం అభిమానులకే కాదు సినీ ప్రముఖులను సైతం షాక్ కు గురి చేసాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కావడం తో అంత ఈమె గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
కాగా NIA నోటీసుల ఫై వరలక్ష్మి స్పందించారు. ‘ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ సమస్య గురించి స్పష్టత ఇవ్వడం ముఖ్యమని నేను భావించాను. నాకు ఎన్ఐఏ సమన్లు ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమే. అవన్నీ పుకార్లు మాత్రమే. నాకు ఎటువంటి సమన్లు జారీ చేయలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎవరూ ఆదేశించలేదు. నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు” అని వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ లేఖ విడుదల చేశారు.