Vakkantham Vamsi : బండ్లన్న డబ్బులు ఎగ్గొట్టిన విషయంపై వక్కంతం వంశీ.. టెంపర్ సమయంలో కోర్టు దాకా గొడవ..

ఓ ఇంటర్వ్యూలో వక్కంతం వంశీ బండ్ల గణేష్ తో జరిగిన గొడవ గురించి మాట్లాడాడు.

Published By: HashtagU Telugu Desk
Vakkantham Vamsi Sensational Comments on Bandla Ganesh Spoke about Temper Movie Issue

Vakkantham Vamsi Sensational Comments on Bandla Ganesh Spoke about Temper Movie Issue

సినీ పరిశ్రమలో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతాయని, ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారని తెలిసిందే. తెలియని వాళ్లే కాదు ప్రముఖులకు కూడా ఇలా జరుగుతుంటుంది. రచయిత, దర్శకుడు వక్కంతం వంశీకి(Vakkantham Vamsi) కూడా డబ్బుల విషయంలో ఇలా జరిగింది. టెంపర్(Temper) సినిమా సమయంలో బండ్ల గణేష్(Bandla Ganesh) వక్కంతం వంశీకి డబ్బులు ఎగ్గొట్టడంతో కోర్టుదాకా ఈ గొడవ వెళ్ళింది. తాజాగా మరోసారి ఈ గొడవపై స్పందించాడు వంశీ.

వక్కంతం వంశీ ఇటీవలే నితిన్ హీరోగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా తెరకెక్కించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వక్కంతం వంశీ బండ్ల గణేష్ తో జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత కాగా వక్కంతం వంశీ ఈ సినిమాకు రచయితగా పనిచేశారు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ.. టెంపర్ సినిమా విడుదల అయ్యాక ఒక డేట్ వేసి చెక్ ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ చెక్ బౌన్స్ అయింది. సినిమా కూడా విడుదల అవ్వడంతో నేను ఎవర్ని కలవాలి? ఏం చేయాలి తెలియలేదు. కానీ బండ్ల గణేష్ కావాలనే నాకు డబ్బులు ఇవ్వలేదనిపించింది. బండ్ల గణేష్ ని కలవడానికి ట్రై చేసినా కుదరలేదు. అందుకే కోర్టులో కేసు వేశాను. ఈ విషయంలో కోర్టు చుట్టూ బాగా తిరిగాను. ఆ తర్వాత కోర్టులో తీర్పు వచ్చాక ఇండస్ట్రీలోని ఓ పెద్ద మనిషి ద్వారా మేమిద్దరం సెటిల్ చేసుకున్నాం. ఆ తర్వాత నుంచి నాతో మళ్ళీ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత టెంపర్ హిందీ రైట్స్ అమ్మడానికి ముంబైకి ఇద్దరం కలిసే వెళ్ళాం అని చెప్పాడు.

అలాగే.. డబ్బుల విషయంలో చాలా సార్లు మోసపోయానని, కొంతమంది అయితే ఇప్పటికి డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. ఇక బండ్ల గణేష్ కేసు విషయానికొస్తే.. టెంపర్ సినిమాకు వక్కంతం వంశీకి డబ్బులు ఎగ్గొట్టడంతో కోర్టులో కేసు వేయగా కోర్టు జైలు శిక్ష విధించి, 15 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత బండ్లన్న బెయిల్ తెచ్చుకొని ఓ మధ్య వ్యక్తితో వక్కంతం వంశీతో సెటిల్ చేసుకొని డబ్బులు ఇచ్చాడు. అప్పట్లో ఈ కేసు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

 

Also Read : Roshan Kanakala : సుమ – రాజీవ్ కనకాల విడాకుల వార్తలపై మాట్లాడిన రోషన్ కనకాల..

  Last Updated: 10 Dec 2023, 04:18 PM IST