Site icon HashtagU Telugu

Vaishnavi Chaitanya : బేబీ వైష్ణవి ఇది అస్సలు ఊహించలేదుగా..!

Vaishnavi Chaitanya Career risk with Love me Result

Vaishnavi Chaitanya Career risk with Love me Result

Vaishnavi Chaitanya యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ చేసి ఆ తర్వాత వెబ్ సీరీస్ లకు ప్రమోట్ అయిన వైష్ణవి చైతన్య ఆ క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకుంది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అమ్మడు బేబీ సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా వైష్ణవి మాయలో పడిపోయారు. తెలుగు అమ్మాయిగా ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. ఐతే బేబీ తర్వాత వైష్ణవి సినిమాల సెలక్షన్ ఆమెను ట్రాక్ తప్పేలా చేస్తుంది.

రీసెంట్ గా వైష్ణవి చైతన్య లవ్ మీ సినిమా చేసింది. ఆశిష్ రెడ్డి హీరోగా చేసిన ఈ మూవీ ఏపైల్ మంత్ ఎండ్ రిలీజైనా ప్రేక్షకులు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డాక వైష్ణవి చైతన్యకు ఇలాంటి రిజల్ట్ అస్సలు ఊహించలేదు. హిట్ పడింది కదా అని వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్తే మాత్రం కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది.

లవ్ మీ మీద భారీ ఆశలు పెట్టుకున్న వైష్ణవి చైతన్యకు నిరాశ తప్పలేదు. ఐతే ఆ సినిమా తర్వాత స్టార్ బోయ్ సిద్ధుతో జాక్ సినిమాలో నటిస్తుంది వైష్ణవి చైతన్య. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో అయినా వైష్ణవి మళ్లీ హిట్ కొడుతుందేమో చూడాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అందుకున్న సిద్ధు నెక్స్ట్ సినిమాల విషయంలో అంతే ఫోకస్ గా కనిపిస్తున్నాడు.

Also Read : Bhagya Sri : విజయ్ దేవరకొండతో రవితేజ హీరోయిన్.. లక్ మామూలుగా లేదుగా..!