Ustaad Bhagat Singh Trailer: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న భారీ స్థాయిలో విడుదల కానుంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గంటల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటివరకు కొన్ని టీజర్లు, పాటలు విడుదలయ్యాయి. తాజాగా చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
హరీష్ శంకర్ ఈ ట్రైలర్‌లో రొమాన్స్, యాక్షన్, కామెడీ, పవర్ ఫుల్ డైలాగులతో కూడిన అన్ని కమర్షియల్ హంగులను రంగరించారు. పవన్ కళ్యాణ్ తన వినోదాత్మక అవతారంతో ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోని ఎలా చూపించాలో హరీష్‌కు బాగా తెలుసని ఈ ట్రైలర్ మరోసారి నిరూపించింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, ముఖ్యంగా ఊహించని డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి.
Also Read: రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల పాత్ర కథలో కీలకమైన మలుపులతో పాటు వినోదాన్ని పంచే విధంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, అవినాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
