Site icon HashtagU Telugu

Usha Uthup Husband: ప్ర‌ముఖ గాయ‌ని ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భ‌ర్త మృతి

Usha Uthup Husband

Usha Uthup Husband

Usha Uthup Husband: భారతీయ పాప్ సింగర్ ఉషా ఉతుప్ ఇంట్లో విషాదం నెలకొంది. గాయని భర్త (Usha Uthup Husband) జానీ చాకో ఉతుప్ (78) కన్నుమూశారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని చెబుతున్నారు. గాయని భర్త మరణం గురించి సమాచారం ఆమె కుటుంబం అందించింది. అందులో జానీ చాకో ఉతుప్ సోమవారం కోల్‌కతాలో మరణించారని తెలిపారు. జానీ తన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న స‌మ‌యంలో గుండెపోటుకు గుర‌య్యాడ‌ని పేర్కొన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చాకో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మీడియా కథనాల ప్రకారం.. గాయని ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ ఇంట్లో టీవీ చూస్తున్నారు. అకస్మాత్తుగా ఆయ‌న‌కి గుండెపోటు మొద‌లైంది. విషయం తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు చాకో ఉతుప్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయిత అప్పటికి చాలా ఆలస్యం అయింది. జానీ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వార్త తెలియగానే సంగీత పరిశ్రమలోని ఉషా ఉతుప్ అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. జానీ అంత్యక్రియలు ఈరోజు అంటే మంగళవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: Iran – Hezbollah : హిజ్బుల్లాకు మద్దతు.. లెబనాన్‌పై దాడి చేస్తే ఖబడ్దార్ : పెజెష్కియాన్

జానీ.. ఉషా ఉతుప్‌కు రెండవ భర్త

జానీ చాకో ఉతుప్ గాయని ఉషా ఉతుప్ రెండవ భర్త అని తెలిసిందే. వీరిద్దరూ 70వ దశకంలో తొలిసారి కలుసుకున్నారు. ఉష సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖ పాప్ గాయని అయితే, ఆమె భర్త జానీ టీ తోటల రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఉష మొదటి భర్త రాము అయ్యర్. వీరిద్ద‌రి మ‌ధ్య ఐదేళ్లు మాత్ర‌మే బంధం కొన‌సాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. తనది, జానీ చాకో ఉతుప్‌ది వేర్వేరు మతాలు అని గాయని ఉషా ఉతుప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే వారి బంధానికి మతం ఎప్పుడూ అడ్డు రాలేదని కూడా తెలిపింది. ఉషా ఉతుప్ భ‌ర్త మ‌ర‌ణ‌వార్త తెలియగానే సినీ ఇండ‌స్ట్రీ నుంచి ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join