Urvashi Rautela: 24 క్యారెట్ల బంగారం కేక్‌ను కట్ చేసిన ఊర్వశి రౌతేలా.. నెట్టింట ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Updated On - February 26, 2024 / 10:37 AM IST

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె పలు ఐటమ్ సాంగ్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఇది సినిమా ఇండస్ట్రీలో మామూలుగా ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్లకు హీరోయిన్ గా అవకాశాలు రావడం అన్నది చాలా తక్కువ. కానీ ఈ ముద్దుగుమ్మకు ఐటెం సాంగ్స్ తో పాటు సినిమాలలో హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చినప్పటికీ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తూ కేవలం ఐటమ్ సాంగ్స్ లో మాత్రమే చేస్తాను అంటోంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో తరచూ ఏదోక విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఊర్వశి తాజాగా కూడా మరొకసారి వార్తల్లో నిలిచింది.

తాజాగా 30వ పుట్టిన రోజును వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటోంది. అయితే అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా! స్పెషల్ ఉందండోయ్. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఏకంగా 24 క్యారెట్ల బంగారు పూత పూసిన కేక్ ని కట్ చేసి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఇది నిజమైన బంగారు పూతతో కూడిన కేక్. ప్రముఖ ర్యాపర్ యోయో హనీ సింగ్ కూడా ఊర్వశి వెంట ఉన్నారు. ఆ కేక్ కట్ చేస్తున్న ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఆ గోల్డ్ కేక్ పక్కనే సాధారణ చాక్లెట్ కేక్ కూడా ఈ ఫొటోలలో చూడవచ్చు. ఊర్వశి రౌతేలా తన ప్రత్యేక స్నేహితుడైన టాప్ సింగర్, ర్యాప్ స్టార్ యోయో హానీ సింగ్ తో కలిసి పుట్టినరోజు జరుపుకుంది. ఊర్వశి కేక్ కట్ చేసిన అనంతరం హనీసింగ్ ఆమెకి కేక్ తినిపించారు.

ఊర్వశి రౌతేలా తన పుట్టినరోజును లవ్‌డోస్ 2 మ్యూజిక్ వీడియో సెట్స్‌లో జరుపుకుంది. పుట్టినరోజు సందర్భంగా ఊర్వశి రెడ్ కలర్ డ్రెస్‌ లో అదరహో అనిపించింది. బర్త్ డే ఫొటోలను షేర్ చేస్తూ హనీ సింగ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది ఊర్వశి రౌతేలా. తన ప్రయాణంలో హనీ సింగ్‌ది ముఖ్యమైన పాత్ర అని,హనీ సింగ్ తన కెరీర్ కోసం చాలా ప్రయత్నాలు చేశాడని,హనీ సింగ్‌కు మాటలు తక్కువని ఊర్వశి రౌతేలా తెలిపింది. అయితే ఊర్వశి రౌతేలా కేక్ కటింగ్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. భారతదేశంలో 24 క్యారెట్ల నిజమైన బంగారు కేక్‌ను కత్తిరించిన మొదటి మహిళ అని కొందరు వాళ్ల కడుపులో బంగారం ఉందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్స్ ఆ కేక్ తిన్న తర్వాత మాకు ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..