Site icon HashtagU Telugu

Urvashi Rautela : ఐటం సాంగ్స్‌తోనే కోట్లు సంపాదిస్తున్న భామ.. నిమిషానికి కోటి రూపాయలా??

Urvashi Rautela

Urvashi Rautela

ఊర్వశి రౌతేలా(Urvashi Rautela).. గత కొన్ని రోజులుగా టాలీవుడ్(Tollywood) లో ఈ పేరు బాగా వినిపిస్తుంది. బాలీవుడ్(Bollywood) లో ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. బాలీవుడ్ లో ఇప్పటికే అనేక స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ భామ ఇటీవల వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ అదరగొట్టింది ఊర్వశి రౌతేలా. ఏ ముహూర్తాన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో కానీ ఒకే సంవత్సరంలో ఏకంగా నాలుగు స్పెషల్ సాంగ్స్ చేసింది తెలుగులో. వాల్తేరు వీరయ్య తర్వాత అఖిల్(Akhil) ఏజెంట్(Agent) సినిమాలో ఓ సాంగ్ చేసింది. త్వరలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో(Bro), రామ్ స్కంధ సినిమాలతో కూడా మెప్పించనుంది. ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటుంది ఊర్వశి.

అవకాశాల మాట పక్కన పెడితే ఈ అమ్మడి రెమ్యునరేషన్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా ఒక హీరోయిన్ టాలీవుడ్ లో మహా అయితే కోటి నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటుంది ఒక సినిమాకు. కానీ ఊర్వశి ఒక్క సాంగ్ కే 2 కోట్లు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఊర్వశి టాలీవుడ్ లో ఒక్కో స్పెషల్ సాంగ్ కు కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఇక బాలీవుడ్ లో అయితే ఒక్కో పాటకు మూడు కోట్లు తీసుకుంటుందట. మూడు నిమిషాల సాంగ్ కి మూడు కోట్లు అంటే నిమిషానికి కోటి రూపాయలు సంపాదిస్తుందా అని ఆశర్యపోతున్నారు.

సినిమా అంతా కష్టపడినా హీరోయిన్ కి అదే రెమ్యునరేషన్ ఒక మూడు రోజులు స్పెషల్ సాంగ్ చేసినా అదే రెమ్యునరేషన్ వస్తుండటంతో ఊర్వశి ఎక్కువగా ఐటెం సాంగ్స్ కే మొగ్గు చూపుతుందని సమాచారం. ఐటెం సాంగ్స్ కి ఈ రేంజ్ లో డబ్బులు ఇస్తున్నారు కాబట్టే చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ వెయ్యడానికి వెనుకాడట్లేదు.

 

Also Read : Ashish Vidyarthi : 58 ఏళ్ళ వయసులో రెండో భార్యతో హనీమూన్‌కి వెళ్లిన ఆశిష్ విద్యార్ధి..