Urvashi Rautela: ఊర్వశి రౌతేలా.. రూ.190 కోట్ల ఇల్లు.. రూ.276 కోట్ల నగలు

హీరోయిన్ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఉండే ఇంటి విలువ ఎంతో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!! కాస్ట్లీ సిటీ ముంబైలో రూ.190 కోట్ల విలువైన ఇంట్లో ఆమె ఉంటున్నారు.

  • Written By:
  • Updated On - June 1, 2023 / 12:12 PM IST

హీరోయిన్ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఉండే ఇంటి విలువ ఎంతో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!! కాస్ట్లీ సిటీ ముంబైలో రూ.190 కోట్ల విలువైన ఇంట్లో ఆమె ఉంటున్నారు. దివంగత మూవీ ప్రొడ్యూసర్ యష్ చోప్రా ఇంటి పక్కన ఉన్న రూ.190 కోట్ల విలువైన అద్భుతమైన బంగ్లాలోకి ఆమె ఇటీవల మారారు. ఈ బిల్డింగ్ లో 4 అంతస్తులు ఉన్నాయి. ఇందులో విలాసవంతమైన తోట, వ్యక్తిగత వ్యాయామశాల, భారీ పెరడు కూడా ఉన్నాయి.

కొన్ని అందాల పోటీల్లో పాల్గొన్న ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. సింగ్ సాబ్ ది గ్రేట్, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె పలు ప్రముఖ మ్యూజిక్ వీడియోలలో కూడా భాగమైంది. ఆమె ఇటీవలే రణదీప్ హుడాతో కలిసి ఇన్‌స్పెక్టర్ అవినాష్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది . గత నెలలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఆమె కనిపించింది.

రూ.276 కోట్ల నగలు..

ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన 76వ ఎడిషన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) డిఫరెంట్‌ నగలు ధరించి హాజరయ్యారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ భామ వేసుకున్న మొసలి నగలు డూప్లికేట్‌వని కొందరు కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటి ధర తెలిసిపోయింది.ఊర్వశి రౌతేలా మెడలో, చెవులకు ధరించిన వెరైటీ ఆర్నమెంట్స్ ఖరీదు అక్షరాల 276కోట్ల రూపాయలు అని స్వయంగా ఆమె పీఆర్ టీమ్‌ ప్రకటించింది. ఇంత ఖరీదైన నెక్లెస్‌ వేసుకోవడం వెనుక ఊర్వశి రౌతేలా తన ఫ్యాషన్‌ టేస్ట్‌ని చూపించడానికే భారీ మొత్తంలో ఖర్చు చేసిందని తెలుస్తోంది.

ఒక్క ఐటెం సాంగ్‌ కు రూ.2 కోట్లు

వాల్తేరు వీరయ్య మూవీలో ఐదు పాటలు ఉండగా.. ఆడియెన్స్‌ని బాగా మెప్పించిన సాంగ్ ‘బాస్ పార్టీ’ . బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఈ ఐటెం సాంగ్‌లో చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసింది. ‘బాస్ పార్టీ’ సాంగ్‌కి రూ.2 కోట్ల రెమ్యూనరేషన్‌ ను ఊర్వశి రౌతేలా తీసుకుందట. వాల్తేరు వీరయ్య మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకోవడంతో.. బాలీవుడ్‌లో బాగా ఫేమస్ అయిన ఊర్వశి రౌతేలాతో ఈ సాంగ్‌ని చేయించినట్లు తెలుస్తోంది.

Also Read:  300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది