#NBK109 : బాలకృష్ణ మూవీ సెట్ లో ప్రమాదం..హాస్పటల్ లో హీరోయిన్

హైదరాబాద్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ప్రమాదానికి గురైంది

Published By: HashtagU Telugu Desk
Urvashi Rautela Hospitalize

Urvashi Rautela Hospitalize

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కుతున్న మూవీ #NBK109 (వర్కింగ్ టైటిల్). గత కొద్దీ రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వస్తుంది. తాజాగా ఈ మూవీ సెట్ లో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె టీమ్ తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం తో వెంటనే ఆమెను హాస్పటల్ లో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది..అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ చిత్రానికి వీర మాస్ (Veera Mass) అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత ఏడాది సంక్రాంతికి.. అటు బాలకృష్ణ కు, ఇటు బాబీకి కలిసి వచ్చిన ‘వీర’ సెంటిమెంట్‌ను మళ్లీ కొనసాగిస్తూ, ఈ చిత్రానికి కూడా ‘వీర’ అనే అక్షరాలు కలిసొచ్చేలా టైటిల్‌ పెట్టాలని భావిస్తున్నట్లు వినికిడి. మరి నిజంగా ఆ టైటిల్ పెడతారా..లేదా అనేది చూడాలి. ఇక ఈ మూవీ లో యానిమల్ ఫేమ్ బాబీ డియోలు, చాందిని చౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SS థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఊర్వశీ రౌటేలాకు గాయం కావడంతో.. శరవేగంగా సాగుతున్న షూటింగ్ కు బ్రేక్స్ పడ్డట్లు అయ్యింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Read Also : Free Sand in AP : చంద్రబాబుకు జై కొట్టిన కొడాలి నాని

  Last Updated: 09 Jul 2024, 09:48 PM IST