Site icon HashtagU Telugu

Review : UI – వింటేజ్ ఉపేంద్ర ఈజ్ బ్యాక్

Ui Review

Ui Review

బ్యాన‌ర్‌: ల‌హ‌రి ఫిలింస్‌, వీన‌స్ ఎంట‌ర్టైన‌ర్స్‌
టైటిల్‌: UI
న‌టీన‌టులు: ఉపేంద్ర‌, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: హెచ్‌సీ. వేణు
ఫైట్స్‌: థ్రిల్ల‌ర్ మంజు, ర‌వివ‌ర్మ‌, చేత‌న్ డిసౌజా
ఎడిటింగ్‌: విజ‌య్ రాజ్‌
మ్యూజిక్‌: అజ‌నీష్ లోక‌నాథ్‌
నిర్మాత‌లు: జీ మ‌న్మోహ‌న్‌, శ్రీకాంత్ కేపీ
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ఉపేంద్ర‌
సెన్సార్ రిపోర్ట్ : U / A
ర‌న్ టైం: 130 నిమిషాలు
రిలీజ్ డేట్ : 20 డిసెంబ‌ర్‌, 2024

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) నటించిన ‘ యూఐ ’ (UI) ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచింది. ఉపేంద్ర గత సినిమాలలాగే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. ఒక‌ప్పుడు ఉపేంద్ర అంటే ఇండియ‌న్ సినిమాలో ట్రెండ్ సెట్ట‌ర్‌. దాదాపు 10 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఉపేంద్ర న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ‘యూఐ’ సినిమా కోసం అటు కన్నడ ఉపేంద్ర ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎదురుచూసారు. ఇటీవల ఉపేంద్ర తెలుగులోనూ ప్ర‌మోష‌న్లతో సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా సంస్థ రిలీజ్ చేయడంతో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ రోజు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యూఐ సినిమా ఎలా ఉందో చూద్దాం.

‘పగలు, రాత్రి’ సత్య(ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా కథా నేపధ్యాన్ని ఎంచుకున్నాడు ఉపేంద్ర. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే సరికొత్త కథాంశంతో ఎవరు ఊహించని నేరేషన్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు ఉపేంద్ర. అటు హీరోగా, ఇటు దర్శకుడుగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్‌తో వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేశాడు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రాజకీయాలపై తనదై శైలీలో తన మార్క్ డైలాగ్స్ తో సెటైర్లు వేసాడు ఉపేంద్ర. ‘UI’ అంటే ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అని, యూనివర్సల్ ఇంటెలిజెన్స్, ‘యూ అండ్ ఐ’ అని ఇలా ఎవరికీ నచ్చిన విధంగా వాళ్ళు అనుకోండి అని ప్రేక్షకులకు వదిలేసాడు. ఈ సినిమాలో కల్కి అవతారంగా ఉపేంద్ర నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. కాంతారా సంగీత దర్శకుడి అజనీష్ లోకానాధ్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు. సినిమాను ఆసాంతం ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకువెళ్లి కాస్త బుర్రక పదును పెట్టి, చివరికి ఊహించని విధంగా ప్రేక్షకులలో మెదడులలోనే అనేక ప్రశ్నలు రేకెత్తించే విధంగా ముగించడం ఉపేంద్ర మార్క్ అని చెప్పొచ్చు..

ఫైనల్ : వింటేజ్ ఉపేంద్ర ఈజ్ బ్యాక్.. 3.5/5

Read Also : Rohit Sharma Opener: మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓపెనర్ పై ఉత్కంఠ.. రోహిత్ ఏం చెయ్యబోతున్నాడు ?