Site icon HashtagU Telugu

Upasana : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ఉపాసన..

Ram Upasana Imresizer

Ram Upasana Imresizer

మెగా అభిమానులకు (Mega Fans) గుడ్ న్యూస్ తెలిపింది ఉపాసన (Upasana). సోషల్ మీడియా వేదికగా మరో బేబీ రాబోతుంది అంటూ తెలిపి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఉపాసన పోస్ట్ చూసి మళ్లీ తల్లి కాబోతుందా ఏంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ ఓ పక్క , మెగా కోడలి గా మరో పక్క ఇలా రెండు పక్కల సమాజంలో ఓ హోదా ఉన్నప్పటికీ , అవేమి పట్టించుకోకుండా ఓ సామాన్య మహిళగా ఉండేందుకు ఉపాసన ఇష్టపడుతుంటుంది. యంగ్ ఎంట్రప్రెన్యూర్ , సామాజిక సేవకురాలు , న్యూట్రిషన్ ఎక్స్పర్ట్..ఇలా ఆమెలో చాల టాలెంట్ లు ఉన్నప్పటికీ , చాల సింపుల్ గా ఉండడం ఆమెకే చెల్లుతుంది.

ఇక ఈ ఏడాది జూన్ 20న ఉపాసన (Upasana ) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. క్లిన్ కార అనే పేరు ఆ పాప కు పెట్టడం జరిగింది. ఇక క్లీన్ కార ఫేస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన సోషల్ మీడియా లో మరో బేబీ రాబోతుంది అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ ట్వీట్ చూసి మరో బేబీ రాబోతోందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

అయితే అసలు విషయం ఏంటంటే.. ఆమె పెద్దమ్మగా ప్రమోట్ అవుతుందట. ఉపాసనకు ఒక చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు అన్షుపాల. ఈమె మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఉపాసన చెల్లి తల్లి కాబోతుందంటూ తెలుస్తుంది. అన్షు సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.. ఇంకో బేబీ రాబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవడంతో ఉపాసన చెల్లెలకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Also : Priest Murder: పూజారి దారుణ హత్య.. పోలీస్ వాహనానికి నిప్పు

Exit mobile version