నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) షో పై అంచనాలు ఏ స్థాయిలో నెలకొన్నాయో తెలియంది కాదు. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడం..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) తో స్టార్ట్ చేయడం..విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో .. సరదాగా, ఆసక్తికర ప్రశ్నలతో సాగినట్లు చూపించేసరికి. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అభిమానులు , పార్టీ శ్రేణులు ఇలా యావత్ ప్రజానీకం ఎదురుచూసారు. వారి ఎదురుచూపులు , అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎపిసోడ్ సాగింది. రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో భేటీ, చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజుల అనుభవాలు, వ్యక్తిగత విషయాలు వంటి పలు అంశాల గురించి వివరించారు.
ముఖ్యంగా తనను అక్రమ కేసులో అరెస్ట్ చేయడం ఫై ఎమోషనల్ అయ్యారు. నంద్యాలలో అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ పేరుతో రాత్రంతా తిప్పారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మనం చేయని తప్పుకు శిక్ష అనుభవించడమే కాకుండా అరెస్ట్ చేసిన పద్ధతితో నా గుండె తరుక్కుపోయింది. వెనకాల నుంచి ‘బాధ్యత’ గుర్తొస్తోంది. నేను నిరుత్సాహపడటం సరికాదు. ఎక్కడిక్కడ అన్నింటిని ఎదుర్కొన్నాను. ఆశయం కోసం పనిచేయడమే శాశ్వతమని, ముందుకెళ్లాలని భావించాను’ అని అన్జపబుల్ షోలో ఎమోషనల్ అయ్యారు.
తానెప్పుడూ రాజకీయాల్లో కక్షసాధింపునకు పాల్పడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తొలిసారి నేను రూలింగ్లో ఉన్నప్పుడు వైస్సార్ ప్రతిపక్షంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆయన రెచ్చిపోయినా నేను సంయమనం పాటించేవాడిని. ఆ తర్వాత ఆయన సీఎం అయినప్పుడు దూకుడుగా వ్యవహరించేవాడు. అయినా నేను నిలదొక్కుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. దీంతో ఆయన తగ్గి నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి’ అని చెప్పుకొచ్చారు.
Read Also : AP Nominated Posts : రెండో దశలో 40కి పైగా కార్పొరేషన్లు పదవులు – చంద్రబాబు