రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ (Game Changer Pre Release)ఈవెంట్ కారణంగా విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈవెంట్ చూసేందుకు వీరు ఇంటి నుండి బయలుదేరగా..ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి 9.30 గంటల సమయంలో వడిశలేరు వద్ద వీరి బైక్ ను వ్యాన్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని వెంటనే పెద్దాపురం ఆసుపత్రికి తరలించినా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనతో అభిమానులలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతిపై కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు కూడా వెలువడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. వెంకటరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈవెంట్‌లో బైక్ స్టంట్ల ప్రోత్సాహం కల్పించారని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అందుకు ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గేమ్ ఛేంజర్ (Game Changer ) పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో శనివారం రాజమండ్రి లో ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావడం తో సినిమాకు మరింత బజ్ వచ్చింది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు ఏపీకి సంబదించిన పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు హాజరై సందడి చేసారు.
Read Also : Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో పాయల్‌కు నిరాశ.. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ వెనుకంజ