Site icon HashtagU Telugu

Electric Shock : సూర్య ఫై అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసింది

Two Suriya fans die due to electric shock in AP

Two Suriya fans die due to electric shock in AP

సూర్య (Surya) ఫై అభిమానం ఇద్దరి అభిమానుల ప్రాణాలు పోయేలా చేసింది. తమిళ్ హీరో సూర్య కు తమిళనాట మాత్రమే కాదు తెలుగు నాట వీరాభిమానులు ఉన్నారు. సూర్య నుండి కొత్త సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ ను ముస్తాబు చేయడం , భారీ ఎత్తున ప్లెక్సీ లు, కటౌట్స్ ఏర్పాటు చేయడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అలాగే బర్త్ డే రోజున పలు సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ఈరోజు సూర్య బర్త్ డే. ఈ సందర్బంగా నర్సరావుపేటలో సూర్య ప్లెక్సీలు కడుతూ..ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ప్రాణాలు (Surya Fans) విడిచారు. ఈ ఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

డిగ్రీ చదివే వెంకటేష్ , సాయి లకు సూర్య అంటే చాల ఇష్టం. సూర్య సినిమా వస్తుందంటే చాలు విడుదల రోజే సినిమా చూడడం చేస్తుంటారు. అలాగే ప్రతి ఏడాది సూర్య బర్త్ డే రోజున విషెష్ చెపుతూ ప్లెక్సీ లు ఏర్పటు చేస్తుంటారు. ఈరోజు సూర్య బర్త్ డే సందర్బంగా నర్సరావుపేట (Narasaraopet) టౌన్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫ్లెక్సీలు కడుతుండగా ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ పక్కన ఉన్న కరెంట్ వైర్లకు తగిలింది. దీంతో వీరిద్దరికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. వీరి మరణంతో కాలేజీ విద్యార్థులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్‌ది మోపూరివారిపాలెం కాగా.. పోలూరి సాయి బాపట్ల జిల్లా పంగలూకు చెందినవాడు. విద్యార్థుల మరణంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also : AP Roads : సీఎం జగన్ కు వర్షాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయి