Site icon HashtagU Telugu

Tollywood : టాలీవుడ్ లో ఆ ఇద్దరి హీరోయిన్స్ దూకుడు..!

Janhvi Kapoor First Attempt Super Success

Janhvi Kapoor First Attempt Super Success

తెలుగులో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత కనిపిస్తూనే ఉంటుంది. ఇలా వచ్చి అలా స్టార్ హీరోయిన్ అయిన కథానాయికలు కూడా సినిమాలతో బిజీ అవ్వడం వల్ల ఈ కొరత ఉంటుంది. ఐతే ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల్లో కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. కానీ వారిలో ఏ ఒకరిద్దరో క్రేజ్ తెచ్చుకుంటారు. ఐతే ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఒక ఇద్దరు భామలు తెలుగులో సూపర్ ఛాన్సులు అందుకుంటున్నారు.

తొలి సినిమా రిలీజ్ కాకుండానే వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ఒకరు జాన్వి కపూర్ (Janhvi Kapoor) కాగా.. మరొకరు భాగ్యశ్రీ అని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ (NTR) తో దేవర సినిమాతో జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే చరణ్ తో సినిమా చేస్తుంది అమ్మడు. ఈ రెండు సినిమాలే కాదు నాని శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ లో కూడా నటిస్తుందని అంటున్నారు.

ఇక మరోపక్క మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ (BhagyaSri). హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ఈ హీరోయిన్ కూడా సినిమా రిలీజ్ కాకుండానే ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో అవకాశం దక్కించుకుందని తెలుస్తుంది. ఇదే కాదు దుల్కర్ సల్మాన్ సినిమాలో కూడా భాగ్య శ్రీ నటిస్తుందని టాక్.

మొదటి సినిమా రిలీజ్ కాకపోయినా ఈ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో వరుస అవకాశాలతో హడావిడి చేస్తున్నారు. కచ్చితంగా ఈ ఇద్దరు తెలుగు తెర మీద కొన్నాళ్లు తమ ఫాం కొనసాగించే ఛాన్స్ ఉందనిపిస్తుంది. భాగ్యశ్రీ నటించిన మిస్టర్ బచ్చన్ సాంగ్ రిలీజ్ కాగా అందులో అమ్మడు తన గ్లామర్ తో అదరగొట్టేసిందని చెప్పొచ్చు.

Also Read : Ram Charan : చరణ్ 16.. ఆ టైటిల్ జస్ట్ రూమర్ మాత్రమేనా..?