Dalljiet Kaur: రెండో భర్తతో పెళ్లై ఏడాది కాకముందే విడాకులు తీసుకున్న నటి.. ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో విడాకులు పెళ్లిళ్లు డేటింగ్ లు అన్నవి కామన్. పెళ్లి కాకముందే కొన్నాళ్లకోట వెయిటింగ్ చేసి ఆ తర్వాత విడిపోయిన వారు చాలామంది

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 01:30 PM IST

సినిమా ఇండస్ట్రీలో విడాకులు పెళ్లిళ్లు డేటింగ్ లు అన్నవి కామన్. పెళ్లి కాకముందే కొన్నాళ్ల పాటు ప్రేమించుకొనిఆ తర్వాత విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించి పెళ్ల చేసుకుని కొన్ని కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిన వారు కూడా ఉన్నారు. అలా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది ఆ విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే నటి కూడా ఒకరు. చూపులు కలిసిన శుభవేళ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి దల్జీత్ కౌర్‏..

ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ వ్యక్తిగత జీవితం మాత్రం అంతా సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటుడు షాలిన్ బానోత్‏ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. 2009లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి జైడన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో కొన్నాళ్లపాటు తన కుమారుడితో కలిసి ఒంటరిగా నివసించింది దల్జీత్ కౌర్. దుబాయ్ లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

నిఖిల్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ భార్యకు విడాకులు ఇచ్చి విడిగా జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు డేటింగ్‏లో ఉన్న వీరు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. అయితే గత ఏడాది మార్చిలో దల్జీత్, నిఖిల్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరు లండన్ లో సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు తన రెండో భర్తతోనూ దల్జీత్ విడిపోయిందనే ప్రచారం నడుస్తోంది. ఇటీవలే తన కొడుకు జైడన్ తో తిరిగి ఇండియాకు వచ్చేసింది దల్జీత్. ఆ తర్వాత తన ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలను డెలీట్ చేసింది. అంతేకాకుండా ఆమె ఇన్ స్టా బయోలో పటేల్ ఇంటిపేరును కూడా తొలగించింది. దీంతో వీరిద్దరి విడాకులు తీసుకున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. ఇక ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ నిఖిల్ సైతం తన సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫోటోస్ డిలీట్ చేశాడు. దీంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.