Boyapati Srinu : స్కంద OTT ఎఫెక్ట్.. బోయపాటిని ఆడేసుకుంటున్న నెటిజన్లు..!

Boyapati Srinu ఒక సినిమా హిట్టైతే ఆ డైరెక్టర్ కి ఎంత పేరు వస్తుందో అది ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే మిగతా వారికన్నా దర్శకుడే ఎక్కువ పాత్ర

Published By: HashtagU Telugu Desk
Trolls On Skanda Director Boyapati Srinu

Trolls On Skanda Director Boyapati Srinu

Boyapati Srinu ఒక సినిమా హిట్టైతే ఆ డైరెక్టర్ కి ఎంత పేరు వస్తుందో అది ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే మిగతా వారికన్నా దర్శకుడే ఎక్కువ పాత్ర పోశిస్తాడు. హిట్ అయిన సినిమాకేమో హీరోని మోసేసి ఫ్లాపైన సినిమాలు డైరెక్టర్ ని తిట్టడం మనోళ్లకు అలవాటే. అయితే బోయపాటి శ్రీను సినిమాలకు హిట్టైనా ఫ్లాపైనా క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తారు. రీసెంట్ గా స్కంద సినిమా డైరెక్ట్ చేసిన బోయపాటి ఆ సినిమా తో మరోసారి తన మాస్ రేంజ్ ఏంటన్నది చూపించారు. అయితే మాస్ సినిమా చేయడం సరే కానీ దానికి తగిన కథ కథనాలు రాసుకోవడంలో బోయపాటి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.

అఖండ తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కిన స్కంద సినిమా డిజాస్టర్ అయ్యింది. రామ్ తో బోయపాటి చేసిన ఈ ప్రయత్నం ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అయితే థియేటర్ లో ఈ సినిమా చూసి బాబోయ్ అనేసిన ఆడియన్స్ లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కాగా అక్కడ చూసి బోయపాటిని ట్రోల్ చేస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ (Disney hotstar) లో స్కంద సినిమా గురువారం స్ట్రీమింగ్ అయ్యింది.

ఓటీటీలో ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ ఉంది కదా అని సినిమా చూసిన ఆడియన్స్ బోయపాటి చూపించిన బొమ్మకి దిమ్మ తిరిగిపోయింది. సినిమా చూసిన ఓటీటీ ఆడియన్స్ బోయపాటిని ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. బోయపాటి ఈ కామెంట్స్ చూస్తే మాత్రం చాలా హర్ట్ అవుతారని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో స్కంద మీద ట్రోల్స్ హాట్ టాపిక్ గా మారాయి. బోయపాటిని ట్యాగ్ చేస్తూ బీభత్సమైన ట్రోల్స్ చేస్తూ నెటిజన్లు హడావిడి చేస్తున్నారు. బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో చేస్తున్నాడు. ఇద్దరు కలిసి అఖండ 2 చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Bigg Boss 7 : ఫ్రెండ్ కోసం అమర్ రిస్క్.. కొత్త కెప్టెన్ ఎవరంటే..!

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 03 Nov 2023, 07:38 PM IST