Sushmita: సుస్మితపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. కాస్ట్యూమ్ డిజైనర్ గా తీసేయాలంటూ?

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 05:41 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల గురించి మనందరికీ తెలిసిందే. సుస్మిత ప్రస్తుతం చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. అయితే ఎప్పటినుంచో ఆమె చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో మెగాస్టార్ ను అభిమానులకు నచ్చే విధంగా చూపించడం కోసం ఆమె ఎంతగానో కష్టపడుతోంది..
తన కూతురు సుస్మిత వర్క్ పట్ల చిరంజీవి కూడా చాలా సార్లు ప్రశంసలు కురిపించారు.

తనని బాగా చూపించేందుకు కష్టపడుతుందని తెలిపారు. రాను రాను మరింతగా యంగ్‌గా చూపిస్తుందని తెలిపారు. తన కూతురు పనితీరుపట్ల ఆయన మురిసిపోయాడు. కానీ అభిమానుల్లో మాత్రం విభిన్నమైన అభిప్రాయం ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టారు. చిరంజీవి లుక్స్ బాగా ఉండటం లేదని అంటున్నారు ఫ్యాన్స్. అందుకు గల కారణం సుస్మితనే అంటున్నారు. అన్ని సినిమాలకు రెగ్యూలర్‌గా చూపిస్తుందని అంటున్నారు.

నెపోటిజం ఉంటే ఇలానే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి లుక్స్ లో మార్పు ఉండటం లేదని, బాగా ఉండటం లేదని అంటున్నారు. ఈ మేరకు ఈ విషయంపై ట్రోలర్స్‌ రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. సుస్మిత కొణిదెల తాజాగా సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. సినిమా గురించి, కాస్ట్యూమ్స్ విభాగం గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా నెటిజన్లు రియాక్ట్ అవుతూ రచ్చ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవికి స్టయిలీష్‌ చేయోద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆమెని మార్చాలని అంటున్నారు. చిరంజీవికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్‌ అంటున్నారు. మరి ఈ విషయంపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.