Trivikram : అల్లు అర్జున్ కాదు.. ఆ స్టార్ తో త్రివిక్రం సినిమా.. వాటే ప్లాన్ గురూజీ..!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం (Trivikram) డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ తో త్రివిక్రం ఇద్దరు కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి,

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 09:18 PM IST

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం (Trivikram) డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ తో త్రివిక్రం ఇద్దరు కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు. ఇక నాలుగవ సినిమాగా వీరి కాంబో సినిమా షురూ చేయాలని అనుకున్నారు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ముందు త్రివిక్రం తో సినిమా అనుకున్నా ఇప్పుడు అట్లీతో పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాడట.

We’re now on WhatsApp : Click to Join

అల్లు అర్జున్ వేరే డైరెక్టర్ ని చూసుకోవడంతో త్రివిక్రం కూడా వేరే హీరోని లైన్ లో పెట్టాడట. అల్లు అర్జున్ ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. చరణ్ ప్రస్తుతం గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. బుచ్చి బాబు సినిమా కూడా నేషనల్ లెవెల్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు చరణ్ సినిమాల రేసులో త్రివిక్రం కూడా వచ్చి చేరాడు. త్రివిక్రం తో చరణ్ ఇదివరకే వర్క్ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకు చరణ్ త్రివిక్రం కలిసి పనిచేయనున్నారట. ఈ ఇద్దరి కాంబో సినిమాపై మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబర్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ రానున్న సినిమాలతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. తప్పకుండా త్రివిక్రం తో చరణ్ కలిసి చేస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.

Also Read : Prabhas Kalki : కల్కిలో హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఎక్కువే.. ఆ స్టార్ హీరోయిన్ సర్ ప్రైజ్ క్యామియో..!