Trivikram : కోలీవుడ్ సూపర్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన త్రివిక్రం..!

Trivikram మహేష్ తో గుంటూరు కారం తర్వాత త్రివిక్రం లాంగ్ గ్యాప్ తీసుకుంటాడని అంటున్నారు. తెలుగులో స్టార్ హీరోలంతా కూడా బిజీగా ఉండగా త్రివిక్రం టైర్ 2 హీరోలతో తన తర్వాత సినిమా

Published By: HashtagU Telugu Desk
Trivikram Guest for Lucky Bhaskar

Trivikram Guest for Lucky Bhaskar

Trivikram మహేష్ తో గుంటూరు కారం తర్వాత త్రివిక్రం లాంగ్ గ్యాప్ తీసుకుంటాడని అంటున్నారు. తెలుగులో స్టార్ హీరోలంతా కూడా బిజీగా ఉండగా త్రివిక్రం టైర్ 2 హీరోలతో తన తర్వాత సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రం సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ కి చాలా టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు త్రివిక్రం.

అయితే లేటెస్ట్ గా తెలుగులో స్టార్స్ ఎవరు ఖాళీగా లేరని కోలీవుడ్ స్టార్ తో త్రివిక్రం సినిమా చేయబోతున్నారని టాక్. దళపతి విజయ్ తో డివివి దానయ్య ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాకు డైరెక్ట్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఆ సినిమాను త్రివిక్రం చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నారట.

త్రివిక్రం డైరెక్షన్ లో విజయ్ హీరోగా సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. ఈ సినిమా కోసం దళపతి విజయ్ కు 200 కోట్ల దాకా పారితోషికం అందిస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో సినిమాకు బదులుగా త్రివిక్రం విజయ్ తో సినిమా చేస్తారని అంటున్నారు. మరి నిజంగానే గురూజీ తమిళ హీరోతో సినిమా చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Pooja Hegde : శారీలో బుట్ట బొమ్మ.. బాపు బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా..!

  Last Updated: 19 Feb 2024, 12:59 PM IST