మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salman) . ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ఇక్కడ మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ మూవీస్ కలిసి నిర్మించిన సినిమా ఇది.
ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమా గురించి ప్రమోషన్స్ జోరందుకున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రం (Trivikram) ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగు ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది. అంటే ఇది త్రివిక్రం సొంత సినిమా అన్నట్టే లెక్క.
ఈవెంట్ కి తనే గెస్ట్..
అందుకే తన సినిమా ఈవెంట్ కి తనే గెస్ట్ గా వస్తున్నాడు గురూజీ. ఏది ఏమైనా త్రివిక్రం ఈవెంట్ కి వస్తే ఆ కవరేజ్ వేరేలా ఉంటుంది. అందుకే లక్కీ భాస్కర్ ఈవెంట్ కి త్రివిక్రం వస్తున్నారు. ఈమధ్యనే అలియా భట్ నటించిన జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు త్రివిక్రం.
గుంటూర్ కారం తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారో క్లారిటీ రాలేదు కాబట్టి సొంత సినిమాలు లేదా తనతో పరిచయం ఉన్న వారి సినిమాల ఈవెంట్స్ కు త్రివిక్రం వెళ్తున్నాడు. ఆయన కూడా సినిమాకు కలిసి వస్తుంది అనుకుంటే ఆయన వచ్చి రెండు మాటలు మాట్లాడటానికి రెడీ అనేస్తున్నారు.
Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ 8లో ఈ వారం ఆ కంటెస్టెంట్ కి బై బై..!