Trivikram Chiranjeevi మాటల మాంత్రికుడు త్రివిక్రం మెగాస్టార్ చిరంజీవి ఈ కాంబో కోసం మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. చిరుతో సినిమా చేయాలని త్రివిక్రం కి కూడా ఉన్నా ఎందుకో ఈ కాంబినేషన్ కి ముహూర్తం బయట పడట్లేదు. అప్పుడెప్పుడో సుబ్బిరామిరెడ్డి చిరంజీవి, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేస్తున్నా.. త్రివిక్రం డైరెక్టర్ అంటూ ప్రకటించారు.
We’re now on WhatsApp : Click to Join
అది ఇప్పటివరకు కుదరలేదు. చిరు, పవన్ సంగతి పక్కన పెడితే కనీసం చిరుతో అయినా గురూజీ సినిమా చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.
లేటెస్ట్ గా ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగారు. చిరుకి పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా దేశంలో భారత రత్న తర్వాత రెండో అత్యున్నత పురస్కారం అందుకున్నందుకు గాను చిరంజీవిని పరిశ్రమకు సంబంధించిన వారంతా కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరు ఇంటికి వెళ్లి త్రివిక్రం కలిశారు. హారిక హాసిని నిర్మాత చినబాబు కూడా త్రివిక్రం తో ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం చిరుతో త్రివిక్రం ఉన్న ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ మాకు ఈ కాంబినేషన్ లో సినిమా కావాలని అంటున్నారు. చిరుతో త్రివిక్రం సినిమా చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. కచ్చితంగా ఈ కాంబో సినిమా ఉంటుంది కానీ దానికి కొంత టైం పడుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తారన్నది క్లారిటీ రాలేదు.
Also Read : Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్లన్ ఏంటి.. స్టార్స్ అంతా బిజీ.. అతనొక్కడే ఆప్షన్..!