Trisha 39: త్రిష తగ్గేదేలే.. నేటికీ అదే అందం, అదే ఫిగర్!

వన్నె తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది త్రిష (Trisha). ఈ బ్యూటీ ఏజ్ 39 అంటే ఎవరైనా నమ్ముతారా..

Published By: HashtagU Telugu Desk
Trisha 39 looks

Trisha

టాలీవుడ్ (Tollywood) అయినా, బాలీవుడ్ అయినా హీరోయిన్ వయసు 30 దాటిందంటే ఇక అంతే. అప్పటివరకు కుర్రహీరోలు, టాప్ హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుతుంటాయి. మహా అయితే సీనియర్ హీరోల పక్కన అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తుంటాయి. మరి 40 సమీపిస్తున్నా.. ఇంకా అవకాశాలు క్యూ కడుతున్నాయంటే ఆ హారోయిన్ త్రిష (Trisha) మాత్రమే  అయి ఉంటుంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ కనిపించిన త్రిష తాజా డిజిటల్ మూవీ “రాంగి”ని ప్రమోట్ చేస్తోంది. ప్రమోషన్స్ తో తన లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.

ఇంటర్ నెట్ లో సంచలనంగా మారుతోంది. ఆమె అందమైన లుక్స్‌తో (Looks) పాటు ఫ్యాషన్ డ్రెస్‌లు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. అయితే, ఆమెను చూస్తే.. వయస్సు 39 సంవత్సరాలు అనిపించదు. వర్షం, నాగార్జున కింగ్ సినిమాల్లో ఎలా ఉందో ఇప్పటికే అదే అందంతో అలరిస్తోంది. ఈ బ్యూటీ లోకేష్ కంగనారాజ్ చిత్రానికి విజయ్ సరసన నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష (Trisha) సెకండ్ ఇన్నింగ్స్ అధికారికంగా ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.

త్రిష ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇకపోతే త్రిష పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆమెనే ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత అప్పటినుంచి ఆమె పెళ్లి పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. త్రిష (Trisha) బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ త్రిష మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు.

Also Read : Janhvi Kapoor: అదిరేటిలో డ్రస్సులో జాన్వీ.. ఫ్యాషన్ ప్రియులు ఫిదా!

  Last Updated: 30 Dec 2022, 02:49 PM IST