తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మంగళవారం (జూన్ 23) తన పుట్టినరోజును జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఫస్ట్ బర్త్ డే ఇది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. కొందరు సెలబ్రిటీలు నేరుగా అతన్ని కలిసి విషెస్ తెలియజేశారు. అయితే ఆయనకు అత్యంత సన్నిహితురాలైన హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రతీ ఏడాది విజయ్ కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పే త్రిష.. ఈ సంవత్సరం సైలెంట్ గా ఉండటంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. విజయ్ – త్రిష రిలేషన్ బ్రేక్ అయిందని, అందుకే సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని కథనాలు వండి వార్చారు. ఇవి చాలదన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారనే విషయం బయటకు రావడం మరో చర్చకు దారితీసింది. అయితే వీటన్నింటికీ ఇప్పుడు ఒకే ఒక్క ఫొటోతో చెక్ పెట్టేశారు త్రిష.
విజయ్‌కు త్రిష ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఆయనతో కలిసి దిగిన ఓ రేర్ ఫొటోను కూడా పంచుకున్నారు. ‘ప్రతిదాన్నీ సార్థకం చేసే ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. హ్యాపీ బర్త్ డే చెబుతూ రెడ్ హార్ట్ ఎమోజీని జోడించడంతో పాటుగా 00.00 అని రాసుకొచ్చారు. ఈ ఫోటోలో విజయ్ నవ్వుతూ ఉండగా.. త్రిష అతన్నే చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. విజయ్ ఎదురుగా ఐదు బర్త్‌డే కేక్స్ కూడా ఉన్నాయి.
విజయ్ తో త్రిష కలిసి దిగిన ఫోటో కొత్తదా? లేక గతంలో తీసుకున్నదా? అనేది తెలియదు కానీ.. సీఎంకు త్రిష విషెష్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. లేట్ గా చెప్పినా పుకార్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడంపై అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష షేర్ చేసిన ఫోటో, ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
