Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరయ్యారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి, ఇప్పటికే విజయ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేడుకలో త్రిష మెరిశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ […]

Published By: HashtagU Telugu Desk
Trisha Krishnan

Trisha Krishnan

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరయ్యారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి, ఇప్పటికే విజయ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేడుకలో త్రిష మెరిశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.

విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో ఏడుగురు టీవీకే, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో ఎన్.ఆనంద్, ఆదవ అర్జున, కే.ఏ. సెంగొట్టియన్, ఎస్.కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి.వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టి.కె. ప్రభు ఉన్నారు.

  Last Updated: 10 May 2026, 10:34 AM IST