Site icon HashtagU Telugu

Trisha: ఆ విషయంలో నయనతార రికార్డును త్రిష బద్దలు కొట్టిందా.. ఇందులో నిజమెంత?

Trisha

Trisha

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో త్రిష అలాగే నయనతార పేరు కూడా ఒకటి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

సినిమాలలో నటించే విషయంలో మాత్రమే కాకుండా పారితోషికం విషయంలో కూడా ఈ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు నయనతార త్రిష. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో సినిమాలలో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు వెంటనే రెమ్యూనరేషన్ లను పెంచేస్తున్నారు. నటీనటులతో పోలిస్తే నటీమణుల పారితోషికం తక్కువగా ఉంటున్నప్పటికీ, ఇటీవల బాగానే పెంచేశారు.

Also Read: Anupama Parameswaran: చీరకట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న అనుపమ.. ఇదే మాకు కావాల్సింది అంటూ?

కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న తొలి దక్షిణాది నటి నయనతార గుర్తింపు పొందింది. అయితే మహళా కథ బలం ఉన్న మూవీకి ఎక్కువగానే తీసుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు నయనతార రూ.8 కోట్లు తీసుకుంటోంది. ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఒక్క సినిమాకే రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇదే కనుక నిజమైతే నయనతార రికార్డును త్రిష బ్రేక్ చేసినట్టే అవుతోంది. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టీమ్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?

మరోవైపు నయనతార ఒకవైపు హీరోయిన్ గా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తుంది. నయనతార విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఒకవైపు వారి ఆలనా పాలన కూడా చూసుకుంటూ బిజీగా ఉంది నయనతార. అలాగే కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది.