Site icon HashtagU Telugu

Tragedy : మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం

Tragedy In Mega Brother Nag

Tragedy In Mega Brother Nag

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన 14 సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క “ఫ్లాష్” మరణించింది. ఈ విషయాన్ని నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఫ్లాష్ మరణం తమ కుటుంబానికి తీరని లోటని, అది ఒక్క పెంపుడు జంతువు కాదని, కుటుంబ సభ్యుడిగా నిలిచిందని భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. ఫ్లాష్‌తో గడిపిన మధురక్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమని, ముఖ్యంగా తన కుమార్తె నిహారికకు ఇది పెద్ద విషాదం అని నాగబాబు తెలిపారు. నిహారిక రోజంతా ఫ్లాష్‌తోనే కాలక్షేపం చేసేదని, దానితో ఒక ప్రత్యేకమైన అనుబంధం పెంచుకున్నదని , ఇప్పుడు ఫ్లాష్ లేని లోటు ఆమెకు తీరనిదని, అది కుటుంబంలో అందరికీ బాధ కలిగించిందని అన్నారు.

The World Economic Forum : సీఎం రేవంత్ పై ప్రశంసల జల్లు

ఈ ఘటనపై నాగబాబు చేసిన ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు, సెలబ్రిటీలు నాగబాబుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యుల్లానే మారిపోతాయని, అవి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగబాబు రాజకీయ విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున కీలకంగా పనిచేశారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా శ్రమించారు. ఆయన ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ, సీట్ల సర్దుబాటు కారణంగా వెనుకంజ వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నాగబాబుకు త్వరలోనే మంత్రి పదవి ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొదట ఆయనను ఎమ్మెల్సీగా చేస్తారని, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో కూటమి నాయకత్వం ఉందని సమాచారం.