టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు (Daggubati Suresh Babu) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అత్తగారు రాజేశ్వరి దేవి (Rajeshwari Devi) బుధవారం కన్నుమూశారు. రాజేశ్వరి దేవి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి సతీమణి. ఆమె అకాలమరణంతో దగ్గుబాటి కుటుంబం శోకసాగరంలో మునిగిపోయింది. రాజేశ్వరి దేవి మృతిపట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి సురేశ్ బాబు (Suresh Babu) కుటుంబం తణుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మనవడు, నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati ) తన అమ్మమ్మ పాడెను మోశారు, ఈ ఘటన కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురి చేసింది.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్
రాజేశ్వరి దేవి తనయుడు దివంగత వైటీ రాజా రాజకీయాల్లో విశేష సేవలు అందించారు. ఆయన గతంలో తణుకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. పారిశ్రామిక రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ యలపర్తి కుటుంబం ప్రముఖ స్థానం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రెండు రంగాలకు చెందిన ప్రముఖులు తణుకు చేరుకొని రాజేశ్వరి దేవికి నివాళులు అర్పించారు. రాజేశ్వరి దేవి అంత్యక్రియల్లో రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సహా పలువురు ప్రముఖులు దగ్గుబాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేశ్వరి దేవి మరణం తణుకు ప్రజలను కూడా కలచివేసింది. ఈ విషాద సమయంలో దగ్గుబాటి కుటుంబానికి అభిమానులు, సన్నిహితులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.