ఏపీలో కూటమి విజయం సాధించడం..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంత్రి అవ్వడం తో చిత్రసీమ సంతోషం వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వం లో చిత్రసీమ ఎన్నో నష్టాలు, ఇబ్బందులు చవిచూసింది. ఇక ఇప్పుడు బాబు సీఎం కావడం తో మళ్లీ చిత్రసీమ కు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి తమ వంతు సాయం చేసారు. ఆ తర్వాత కూటమి విజయం సాధించిన తరుణంలో కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు మంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు నేరుగా విజయవాడ కు మరికాసేపట్లో రాబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ని విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసే వారిలో డి.వి.వి. దానయ్య, అశ్వనీదత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్; సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్; తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు ఉండనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని కోరనున్నారు. ప్రధానంగా గత వైసీపీ సర్కారు తీసుకున్న టికెట్ల ధరల పెంపు లేదా తగ్గింపు నిర్ణయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కొన్నాళ్లు టాలీవుడ్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను కూడా ప్రస్తావించనున్నారు. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు చర్చించనున్నారు.
Read Also : Kalki Tickets : ప్రభాస్ కల్కి బదులు రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్నారు..?