Top 5 Property Deals : సినీ ప్రముఖుల లేటెస్ట్ టాప్ -5 ప్రాపర్టీ డీల్స్ ఇవే..

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్‌కు ఇంతటి బూమ్ రావడానికి ప్రధాన కారణం సెలబ్రిటీల బిగ్ డీల్సే.

Published By: HashtagU Telugu Desk
Top 5 Bollywood Property Deals

Top 5 Property Deals : సెలబ్రిటీలు, సినీ రంగ ప్రముఖులు బాగానే సంపాదిస్తుంటారు. వారు తమ సంపదను ప్రధానంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడుతుంటారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్‌కు ఇంతటి బూమ్ రావడానికి ప్రధాన కారణం సెలబ్రిటీల బిగ్ డీల్సే. గత కొన్ని వారాల వ్యవధిలో ముంబైలో సినీ రంగ ప్రముఖులు చేసిన టాప్-5 డీల్స్(Top 5 Property Deals)  గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

1.కంగనా రనౌత్

కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు సినిమాల్లోనూ ఆమె బాగానే సంపాదిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇటీవలే ఆమె ముంబైలోని అంధేరీ ప్రాంతంలో రూ.1.56 కోట్లతో ఒక ఆఫీస్ స్థలాన్ని కొన్నారు. అది 407 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాపర్టీ ఆర్చ్ వన్ అనే బిల్డింగ్‌లోని 19వ అంతస్తులో ఉంది. చదరపు అడుగుకు  రూ.38,391 రేటు దీన్ని కంగన కొన్నారు. ఇందుకోసం ఆమె రూ. 9.37 లక్షల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ డీల్  ఆగస్టు 23వ తేదీనే జరిగింది.

2.కార్తీక్ ఆర్యన్

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ముంబైలోని అత్యంత కాస్ట్లీ ఫ్లాటులో అద్దెకు ఉంటున్నారు. దాని అద్దె నెలకు రూ.4.50 లక్షలు. ఇది ముంబైలోని జుహు ప్రాంతంలోని సిద్ధి వినాయక్ భవనంలో ఉంది. ఈ ఫ్లాటు విస్తీర్ణం 1,912 చదరపు అడుగులు. ఆగస్ట్ 28న రూ. 42,500 స్టాంప్ డ్యూటీని చెల్లించి మరీ ఆ ఫ్లాటును కార్తీక్ ఆర్యన్ లీజుకు తీసుకున్నారు.

Also Read :Crocodiles Rescued : నదిలో 440 మొసళ్లు.. ఇళ్లలోకి 24 మొసళ్లు.. వరదలతో బీభత్సం

3.కరణ్ జోహార్

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఓ డ్యూప్లెక్స్ హౌస్‌లో ఉంటున్నారు. దాని అద్దె నెలకు రూ. 8 లక్షలు. దీన్ని కరణ్ జోహార్ మూడేళ్ల కోసం లీజుకు తీసుకున్నారు. మొదటి 12 నెలలకు ప్రతినెలా 8.10 లక్షల అద్దె, రెండో ఏడాది నుంచి ప్రతినెలా రూ.8.50 లక్షల అద్దెను చెల్లించేందుకు లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఆగస్టు 23నే కుదిరింది. పాలి హిల్ ప్రాంతంలోని 21 యూనియన్ పార్క్ అనే భారీ భవనంలోని రెండో, మూడో అంతస్తులలో ఈ డ్యూప్లెక్స్ హౌస్ ఉంది.

4.మనోజ్ బాజ్‌పేయి

నటుడు మనోజ్ బాజ్‌పేయి, ఆయన భార్య షబానా బాజ్‌పేయి ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న మినర్వా టవర్‌లో నివసించేవారు. అక్కడున్న తమ ఇంటిని మనోజ్ దంపతులు రూ. 9 కోట్లకు విక్రయించారు. దాని విస్తీర్ణం 1,247 చదరపు మీటర్లు ఉండేది. దీన్ని ఆగస్టు 16న విక్రయించినట్లు తెలిసింది.

5.సాజిద్ ఖాన్

ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ సోదరుడు, బాలీవుడ్ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్‌కు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌ ఉండేది. అయితే దాన్ని ఆయన రూ. 6.1 కోట్లకు విక్రయించారు. విక్రయించిన ఈ అపార్ట్‌మెంట్‌ 2,176 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. 220 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక కార్ పార్కింగ్ స్థలం కూడా అందులో భాగంగా ఉండేది. ఈ సేల్ డీల్ ఈ ఏడాది జూన్‌లోనే జరిగింది.

  Last Updated: 01 Sep 2024, 04:09 PM IST