Tollywood Bold Beauty: హీరోయిన్ ఎస్తర్ (Tollywood Bold Beauty) రెండో వివాహానికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ఒక పోస్ట్ ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. తెల్లని గౌను ధరించి, సంతోషంగా కనిపించిన ఆమె.. “నా జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే ఒక ప్రత్యేక ప్రకటన చేస్తా” అంటూ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె ధరించిన తెల్లటి గౌను, ప్రత్యేక ప్రకటన అనే పదం ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ఆమె అభిమానులలో ఆనందాన్ని నింపుతోంది.
Also Read: Thatikonda Rajaiah : కడియం.. మగాడివి అయితే రాజీనామా చెయ్ – రాజయ్య
ఎస్తర్- నోయెల్ వివాహం
ఎస్తర్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. ఆమె ‘1000 అబద్దాలు’, ‘భీమవరం బుల్లోడు’ వంటి చిత్రాల్లో నటించారు. బిగ్‌బాస్ ఫేమ్, గాయకుడు నోయెల్ షాన్, ఎస్తర్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ వివాహం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే వారి వివాహ బంధం కేవలం ఆరు నెలల్లోనే ముగిసింది. అప్పటి నుండి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
విడాకుల ప్రకటన
నోయెల్, ఎస్తర్ మధ్య మనస్పర్థలు వచ్చిన తరువాత 2020లో చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. వారి విడాకులు కూడా పెద్ద సంచలనం సృష్టించాయి. విడాకుల తరువాత నోయెల్ బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. ఆ సమయంలో వారి విడాకుల గురించి నోయెల్ పలు విషయాలు బయటపెట్టారు. నోయెల్ మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యారని, ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి సమయం పట్టిందని కూడా చెప్పారు.
వృత్తి జీవితం
ఎస్తర్ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె చివరిగా సకల గుణాభిరామ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా 2022లో విడుదలైంది. ఆ తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాలతో పాటు ఆమె బుల్లితెరపై కూడా నటించారు. ‘సీరియల్ కిల్లర్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటించారు. ఇది ఆమె కెరీర్‌కు మంచి ప్రోత్సాహాన్నిచ్చింది.