Site icon HashtagU Telugu

Tollywood Stars : మాల్దీవుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్స్

Anil Kumar Chalamalasetty 5

Anil Kumar Chalamalasetty 5

పారిశ్రామిక వేత్త, గ్రీన్ కో అధినేత అనిల్ కుమార్ చలమలశెట్టి 50వ జన్మదిన వేడుకలు (Anil Kumar Chalamalasetty 50th birthday celebration) ఇటీవల మాల్దీవుల్లో (Maldives ) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినీ, బిజినెస్ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు, ఇందులో చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్, మహేశ్ బాబు (Mahesh), రామ్ చరణ్ వంటి టాలీవుడ్ సూపర్‌స్టార్లు తమ కుటుంబాలతో హాజరై సందడి చేసారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటిని అభిమానులు, మీడియా వారు తెగ షేర్ చేస్తున్నారు. ప్రముఖులు తమ స్నేహితులతో కలిసి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.

అనిల్ కుమార్ చలమలశెట్టి విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు గ్రీన్ కో (Greenko) గ్రూప్ అధినేత. ఈయన గ్రీన్ కో సంస్థను వ్యవస్థాపించి, భారతదేశంలో మునుముందు ఉత్పత్తి, విద్యుత్, పునఃఉపయోగ శక్తి రంగాల్లో ప్రముఖమైన వ్యవస్థాపకుడు. ఈయన నాయకత్వంలో గ్రీన్ కో గ్రూప్ 2000 సంవత్సరాలలో స్థాపన చేసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా పునఃఉపయోగ శక్తి రంగంలో ప్రాముఖ్యమైన సంస్థగా ఎదిగింది. ఈయన కు చిత్రసీమ ప్రముఖులతో చాల సాన్నిహిత్యం ఉంది. అందుకే ఈయన పుట్టిన రోజు వేడుకలను మాల్దీవుల్లో గ్రాండ్ గా జరిపారు.

Read Also : Happy Childrens Day: మన దేశ పిల్లల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి మీకు తెలుసా!