Site icon HashtagU Telugu

Ram Charan: మెగా ఇంటికి మహాలక్ష్మి.. పాప పేరుపై రామ్ చరణ్ క్లారిటీ

Upasana gave birth to a baby girl today morning in Apollo hospital Hyderabad

Upasana gave birth to a baby girl today morning in Apollo hospital Hyderabad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెలబ్రిటీ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. పండంటి ఆడబిడ్డ పుట్టడంతో మెగా కుటుంబంలో ఆనందంలో తేలియాడుతుంది. ఇటీవల వరుణ్ తేజ్ నిశ్చితార్థం కాగా, తాజాగా మెగా కుటుంబంలోకి ఆడబిడ్డ రావడంతో కుటుంబ సభ్యులు ఎమోషన్ అవుతున్నారు. శుక్రవారం కాసేపటి క్రితం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన ఇంటికి బయల్దేరారు.

అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రాలతో కప్పి ఉంచారు. ఈ సందర్భంగా మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు.

పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. బిడ్డ పేరు గురించి ఉపాసన, తాను చర్చించుకుంటున్నట్లు, త్వరలోనే పేరు పెడ్తామని రామ్ చరణ్ అన్నారు. ఆరోజు తన బిడ్డ పేరును తానే స్వయంగా తెలియజేస్తానని చరణ్ అన్నారు.

Also Read: BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!