Venkatesh : ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వెంకీ మామ.. ఏ పార్టీ కోసం తెలుసా..?

ఇద్దరి అభ్యర్థులను సపోర్ట్ చేయడం కోసం ఏపీ ఎన్నికల ప్రచారంలోకి వెంకీ మామ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఏ పార్టీ కోసం తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Tollywood Senior Hero Venkatesh Is Campaign In Ap Politics

Tollywood Senior Hero Venkatesh Is Campaign In Ap Politics

Venkatesh : ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ తరాల ప్రెజెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం నాగబాబుతో పాటు జబర్దస్త్ నటుడు, డాన్స్ మాస్టర్స్, టీవీ యాక్టర్స్ రంగంలోకి దిగి పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కి సపోర్ట్ తెలియజేస్తూ.. ఇటీవల సీఎం రమేష్,పంచకర్ల రమేష్ ని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఇక తండ్రి, పెదనాన్న బాటలోనే వరుణ్ తేజ్ కూడా పవన్ కోసం కదిలి వస్తున్నారు. పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారు.

ఈ మెగా హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా తన మావయ్య కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తన మావయ్యని సపోర్ట్ చేస్తూ టీడీపీ కోసం నిఖిల్ ఇటీవల ప్రచారం చేసారు. ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగం కాబోతున్నారు. ఇద్దరు నాయకులకు సపోర్ట్ చేయడం కోసం వెంకీ మామ రంగంలోకి దిగితున్నారు. ఇంతకీ వెంకీ మామ ఏ పార్టీ కోసం ప్రచారం చేయబోతున్నారు..?

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డిని, అలాగే కైకలూరు కూటమి (బీజేపీ) అభ్యర్ధ కామినేని శ్రీనివాస్ ని సపోర్ట్ చేయడం కోసం వెంకటేష్ రాబోతున్నారట. రఘురామరెడ్డి వెంకటేష్ కి వియ్యంకుడు అవుతారట. ఇక కైకలూరు అభ్యర్ధ కామినేని శ్రీనివాస్.. వెంకటేష్ భార్యకి సొంత మేనమామ అంట. ఇక ఈ బంధువుల కోసమే వెంకటేష్ మొదటిసారి రాజకీయ ప్రచారంలోకి అడుగుపెట్టబోతున్నారు.

అయితే ఇది చాలామందిని షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీ లేని హీరో అంటే వెంకటేష్. ఆయన పని ఏదో ఆయన చూసుకొని, ఏ వివాదాల్లో వేలు పెట్టకుండా చాలా సైలెంట్ లైఫ్ ని రన్ చేస్తుంటారు. అలాంటి హీరో ఏపీ వంటి రాజకీయాల్లో భాగం అవుతుండడం.. అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Also read : Pawan Kalyan : పవన్‌ని ఎంతో అభిమానించే విజయేంద్ర ప్రసాద్.. ఫస్ట్ మీటింగ్‌లో అవమానించారట..

  Last Updated: 26 Apr 2024, 05:29 PM IST